March 23, 202502:15:20 AM

Sandeep Master Wedding Anniversary: తిరుమలలో 10వ పెళ్లి రోజుని సెలబ్రేట్ చేసుకున్న ‘బిగ్ బాస్’ సందీప్ దంపతులు..ఫోటోలు వైరల్.!

‘బిగ్ బాస్’ సీజన్ 7 కంటెస్టెంట్ అయిన సందీప్ మాస్టర్ అందరికీ సుపరిచితమే. అంతకు ముందు ఇతను ఆట సందీప్ గా బాగా ఫేమస్. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు 8 వారాల పాటు నామినేషన్స్‌లోకి రాకుండా చరిత్ర సృష్టించాడు.అలాగే 8 వారాల పాటు నామినేషన్స్ లోకి రాకుండా ఉన్న తొలి కంటెస్టెంట్ గా ఇతని పేరు రిజిస్టర్ అయ్యింది.దాదాపు 60 రోజుల పాటు హౌస్ లో ఉన్న సందీప్ తన గేమ్ తో ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు.

ఇక బిగ్ బాస్ ముగిసిన తర్వాత కూడా సందీప్ పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదు అనే చెప్పాలి. సోషల్ మీడియాలో అతను పెట్టె డాన్స్ వీడియోలు బాగా ఫేమస్. ఇదిలా ఉండగా.. తాజాగా సందీప్ తన 10 వ పెళ్లిరోజుని తిరుమలలో సెలబ్రేట్ చేసుకున్నాడు. తన భార్య జ్యోతి రాజ్, బాబుని తీసుకుని అతను తిరుమల వెళ్ళాడు. అక్కడ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చి..

కొంతమంది అభిమానులకి ఫోటోలు వంటివి ఇవ్వడం జరిగింది. 2006 మే 29న సందీప్, జ్యోతి..ల వివాహం జరిగింది. వీరికి ఒక బాబు ఉన్నాడు. అతని పేరు లేఖన్. ప్రతి పెళ్లి రోజుకు ఈ జంట తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటుంది. మరే చోటుకి వీళ్ళు వెళ్లరట. ఇక తిరుమలలో ఈ జంట సందడి చేసినప్పుడు తీసుకున్న కొన్ని ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.