March 28, 202502:53:30 AM

Upasana: వైరల్ అవుతున్న ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు!

స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan) , మెగా కోడలు ఉపాసన ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఉపాసన సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ లు సైతం నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. ఉపాసన తాజాగా తన సోషల్ మీడియా పోస్ట్ లో రామ్ చరణ్ ను చూస్తే గర్వంగా ఉందని కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ నాకు ప్రతి విషయంలో మద్దతుగా ఉంటాడని ఆమె తెలిపారు.

ఉపాసన రామ్ చరణ్ ను మెచ్చుకుంటూ చేసిన ఈ పోస్ట్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. మరోవైపు చరణ్ ఉపాసన కలిసి దిగిన ఒక ఫోటో సైతం ఇన్ స్టాగ్రామ్ వేదికగా తెగ వైరల్ అయింది. అటు చరణ్ ఇటు ఉపాసన ఆ ఫోటోలో ఒకే కలర్ ప్యాంట్ లో కనిపించారు. చరణ్ ఉపాసన ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో తెలియకపోయినా ఆమె షేర్ చేస్తున్న ఫోటోలు మాత్రం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి.

భర్తగా చరణ్ స్థానం గురించి గొప్పగా పేర్కొంటూ చరణ్ పై తనకు ఉన్న ప్రేమను ఉపాసన ఈ విధంగా వ్యక్తం చేస్తున్నారని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఒకవైపు భర్తకు తగినంత ప్రాధాన్యత ఇస్తూనే మరోవైపు బిజినెస్ ఉమెన్ గా సత్తా చాటడం ఉపాసనకు మాత్రమే సాధ్యమని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ జనరేషన్ లో ఉపాసన ఎంతోమందికి స్పూర్తి అని ఫ్యాన్స్ చెబుతున్నారు.

మరోవైపు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ (Game changer) సినిమా రిలీజ్ కు సంబంధించి క్లారిటీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గేమ్ ఛేంజర్ సినిమాకు బిజినెస్ కూడా ఒకింత భారీ స్థాయిలో జరుగుతోంది. గేమ్ ఛేంజర్ సినిమాలో యాక్షన్ సీన్స్ తో పాటు సాంగ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయని సమాచారం అందుతోంది. గేమ్ ఛేంజర్ సినిమా ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.