March 22, 202506:52:16 AM

Akira Nandan: కల్కి మూవీ థియేటర్ లో అకీరా.. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారుగా!

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలోని 95 శాతం థియేటర్లలో కల్కి (Kalki 2898 AD) మూవీ ప్రదర్శితం అవుతుండగా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు అన్నీ హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. ప్రముఖ సెలబ్రిటీలు సైతం థియేటర్లలో కల్కి సినిమాను చూస్తూ ఈ సినిమాకు సంబంధించిన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ప్రభాస్  (Prabhas)  మరో భారీ సక్సెస్ ను అందుకోవడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , రేణూ దేశాయ్ (Renu Desai) కొడుకు అకీరా నందన్ కల్కి టీషర్ట్ ధరించి ప్రసాద్ మల్టీప్లెక్స్ లో కల్కి సినిమాను చూడటానికి వచ్చారు.

అకీరా నందన్ ను కల్కి టీ టీ షర్ట్ లో చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ప్రభాస్ అభిమానులు అకీరా నందన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అకీరా తండ్రి పవన్ తో పాటు ఇతర స్టార్ హీరోలను సైతం అభిమానిస్తారని ప్రభాస్ ఫ్యాన్స్ చెబుతున్నారు. “అకీరా కూడా మనోడే రెబల్స్” అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్స్(ట్విట్టర్) లో పోస్ట్ చేసిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సలార్ ను (Salaar) మించిన విజయాన్ని ప్రభాస్ కల్కి సినిమాతో అందుకున్నారనే చెప్పాలి. నాగ్ అశ్విన్  (Nag Ashwin)  విజన్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రాజమౌళి (Rajamouli), ప్రశాంత్ నీల్ (Prashanth Neel) , నాగ్ అశ్విన్ తెలుగు సినిమాల రేంజ్ ను మార్చేస్తున్నారు. తమ సినిమాలతో ఊహలకు సైతం అందని అద్భుతాలు చేస్తూ ఈ దర్శకులు ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.

కల్కి 2898 ఏడీ సినిమాలో వావ్ మూమెంట్స్ ఎక్కువగానే ఉన్నాయి. నాగ్ అశ్విన్ తన డైరెక్షన్ స్కిల్స్ తో అంతకంతకూ ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చిన్న వయస్సులోనే స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సొంతం చేసుకున్న నాగ్ అశ్విన్ భవిష్యత్తులో బాక్సాఫీస్ వద్ద మరిన్ని అద్భుతాలు చేస్తారని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.