March 23, 202509:45:10 AM

Vijay Deverakonda: ‘కల్కి 2898 ad’ … విజయ్ దేవరకొండ ‘అర్జున’ పాత్ర పై ట్రోల్స్ షురూ..!

‘కల్కి 2898 ad ‘ (Kalki 2898 AD)  సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెల్లవారుజాము నుండే షోలు పడ్డాయి. అన్ని షోలు హౌస్ ఫుల్స్ అయ్యాయి. సినిమా చూసిన ప్రేక్షకులంతా చెప్పేది ఒక్కటే మాట. ‘సినిమా సూపర్ హిట్’ అని..! ప్రభాస్ ను దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin)  ప్రజెంట్ చేసిన తీరు.. సైన్స్ ఫిక్షన్ కథని ‘మహాభారతం’ తో ముడిపెట్టిన విధానం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా విజువల్స్ అయితే హాలీవుడ్ సినిమాలను మరిపించే రేంజ్లో ఉంది.

కేవలం 2 సినిమాల అనుభవం ఉన్న నాగ్ అశ్విన్.. ఇంత బాగా ‘కల్కి 2898 ad ‘ ని ఎలా తీయగలిగాడు అనేది అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది. సరే.. ‘కల్కి..’ టాక్ బాగుంది. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది. అలా అని సినిమాలో మైనస్సులు లేవా అంటే.. కాదు అని చెప్పడానికి లేదు. కొన్ని చోట్ల సినిమా ఫ్లాట్ గా అనిపిస్తుంది. అలాగే అక్కడక్కడా లెంగ్త్ ఉన్న సీన్స్ కూడా ఉండటం ఆడియన్స్ ని ఇబ్బంది పెట్టింది.

మరోపక్క సినిమాలో అర్జునుడు పాత్ర పోషించిన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)  .. బాడీ లాంగ్వేజ్ పై విమర్శల వర్షం కురుస్తుంది. అతని లుక్.. ఓకే అనిపించినా, డైలాగ్ డెలివరీ కామెడీగా ఉందని, ‘అశ్వద్ధామ’ అంటూ అతను పిలిచినప్పటికీ.. ‘అమిత్’ అంటూ అతని బ్రాండ్ డైలాగ్ తో అరిచినట్టే ఉందని, తెలంగాణ అర్జునుడు అంటూ విజయ్ దేవరకొండ పాత్ర పై ట్రోల్స్ వస్తున్నాయి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.