March 23, 202508:08:31 AM

Amitabh Bachchan: అలా చేసినందుకు నన్ను తిట్టుకోకండి.. అమితాబ్ షాకింగ్ కామెంట్స్!

కల్కి 2889 ఏడీ (Kalki 2898 AD) సినిమా విడుదలకు మరో 48 గంటల సమయం మాత్రమే ఉంది. హైదరాబాద్ లో ఉదయం 4.30 గంటల నుంచి కల్కి షోలు ప్రదర్శితం కానున్నాయి. 3 గంటల నిడివితో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. అమితాబ్ (Amitabh Bachchan) ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ (Prabhas)  అభిమానులకు క్షమాపణలు చెప్పడం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. కల్కి సినిమాలో నా పాత్రకు మేకప్ వేయడం సామాన్యమైన విషయం కాదని అమితాబ్ తెలిపారు.

నా మేకప్ వేయడానికి ఆర్టిస్ట్ కు మూడు గంటలు పట్టేదని అమితాబ్ వెల్లడించారు. ఆ మేకప్ ను తీసేయడానికి గంటన్నర సమయం పట్టేదని అమితాబ్ చెప్పుకొచ్చారు. నేనెప్పుడూ దాన్ని టార్చర్ లా భావించలేదని తెరపై చూస్తే దాని వెనుక ఉన్న కష్టం కనిపిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. కల్కి గురించి చెప్పడానికి నాగ్ అశ్విన్ (Nag Ashwin) నా దగ్గరకు వచ్చిన సమయంలో ప్రభాస్ రోల్, నా రోల్ చెప్పారని అమితాబ్ తెలిపారు.

కల్కి సినిమాలో ప్రభాస్ పై పోరాడే వ్యక్తిగా నేను కనిపిస్తానని అమితాబ్ వెల్లడించారు. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ దయచేసి నన్ను క్షమించాలని ఆయన పేర్కొన్నారు. సినిమాలో నేను ప్రభాస్ తో ప్రవర్తించిన తీరుకు నన్ను తిట్టుకోకండని అది సినిమాలో భాగమంతే అని అమితాబ్ వెల్లడించారు. ప్రభాస్ వెంటనే వాళ్లందరూ మీ ఫ్యాన్స్ కూడా అని వాళ్లు ఏమీ అనుకోరని ఆయన చెప్పుకొచ్చారు.

కల్కి సినిమాలో కొన్ని విజువల్స్ నమ్మశక్యం కావని అన్నింటిని తెరపై అద్భుతంగా చూపించారని అమితాబ్ పేర్కొన్నారు. కల్కిలో భాగం కావడం గొప్ప అనుభవం అని అమితాబ్ తెలిపారు. నాగ్ అశ్విన్ కల్కి కథ చెప్పిన తర్వాత “ఈ డైరెక్టర్ ఏం తింటున్నాడు.. ఇంత గొప్పగా రాశాడు” అని ఆలోచించానని అమితాబ్ అన్నారు. కల్కి సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.