March 25, 202512:01:05 PM

Baak Collections: తెలుగులో యావరేజ్ ఫలితాన్ని అందుకున్న ‘బాక్’..!

రాఘవ లారెన్స్ (Raghava Lawrence) ‘ముని’ సిరీస్ తరహాలో తమిళంలో ‘ఆరణ్మనై’ సిరీస్ కూడా ఫేమస్ అనే సంగతి తెలిసిందే.ఈ సిరీస్..లో భాగంగా ఆల్రెడీ ‘చంద్రకళ’ ‘కళావతి'(Aranmanai 2) ‘అంతఃపురం'(Aranmanai 3) వంటి సినిమాలు వచ్చాయి. ఇందులో ‘చంద్రకళ’ బాగా ఆడింది. ‘కళావతి’ యావరేజ్ గా ఆడింది. ‘అంతఃపురం’ వచ్చి వెళ్లినట్టు తెలుగు ప్రేక్షకులకి తెలిసుండకపోవచ్చు. అయితే ఆ సిరీస్ లో భాగంగానే ఇప్పుడు నాలుగో మూవీ వచ్చింది . అదే ‘బాక్'(Baak). తమన్నా(Tamannaah Bhatia) , రాశీఖన్నాల (Raashii Khanna) స్పెషల్ సాంగ్ వల్ల ఈ సినిమా పై జనాల ఫోకస్ పడింది.

సుందర్.సి (Sundar. C)  డైరెక్ట్ చేసిన ఈ సినిమా మే 03 న రిలీజ్ అయ్యి నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది. అయినప్పటికీ తమిళంలో అలాగే తెలుగులో మంచి వసూళ్లనే రాబట్టింది అని చెప్పాలి. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.55 cr
సీడెడ్ 0.32 cr
ఆంధ్ర(టోటల్)  0.57 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 1.44 cr

‘బాక్’ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.1.8 కోట్లు. తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.1.44 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.0.36 కోట్లు షేర్ దూరంలో ఆగిపోయింది. ఏదేమైనా ఎవ్వరూ ఊహించని విధంగా తెలుగులో ‘బాక్’ సినిమా బాగానే కలెక్ట్ చేసింది అని చెప్పాలి. కొంచెం ప్రమోట్ చేసి రిలీజ్ చేసుంటే ఇంకా బెటర్ గా పెర్ఫార్మ్ చేసి ఉండేదేమో..!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.