April 1, 202502:51:41 PM

Bachhala Malli Glimpse Review: ఎవడి కోసం తగ్గాలి.. ఎందుకు తగ్గాలి.. నరేష్ మూవీ గ్లింప్స్ వేరే లెవెల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ హీరోలలో అల్లరి నరేష్ (Allari Naresh) ఒకరని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. నాంది సినిమా నుంచి భిన్నమైన కథాంశాలకు ఓటేస్తున్న అల్లరి నరేష్ జయాపజయాలతో సంబంధం లేకుండా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. సుబ్బు డైరెక్షన్ లో రాజేష్ దండా  (Razesh Danada) నిర్మాతగా బచ్చలమల్లి (Bachhala Malli) సినిమా తెరకెక్కగా అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ విడుదలైంది. ఈ గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

అల్లరి నరేష్ బచ్చలమల్లి అనే మొరటోడి పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్నారు. గ్లింప్స్ లో భగవద్గీత వినిపిస్తున్న మైక్ ను విసిరిగొట్టడం, మద్యాన్ని గ్లాస్ లో వెరైటీగా పోయడం, ఒక రకమైన యాటిట్యూడ్ ను చూపించడం గ్లింప్స్ కు హైలెట్ అయింది. ఎవడి కోసం తగ్గాలి ఎందుకు తగ్గాలి అంటూ నరేష్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. అల్లరి నరేష్ పాత్ర లుక్ పుష్పరాజ్ తరహాలో ఉందని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

సెప్టెంబర్ నెలలో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. గ్లింప్స్ ఇంప్రెస్ చేసేలా ఉండటంతో సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. సినిమాలో ట్రాక్టర్ డ్రైవర్ గా అల్లరి నరేష్ కనిపించనుండగా నరేష్ కు జోడీగా అమృతా అయ్యర్ (Amritha Aiyer) కనిపించనున్నారు. విశాల్ చంద్రశేఖర్ (Vishal Chandrasekhar) ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా ఇప్పటికే ఈ సినిమాకు బిజినెస్ పూర్తైందని తెలుస్తోంది. అల్లరి నరేష్ ఈ సినిమాతో కచ్చితంగా హిట్ అందుకుంటాడని అభిమానులు ఫీలవుతున్నారు.

నవ్యత ఉన్న కథాంశాలను ఎంచుకోవడం వల్ల నరేష్ కు సులువుగానే సక్సెస్ దక్కే అవకాశాలు అయితే ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అల్లరి నరేష్ పారితోషికం కూడా పరిమితంగానే ఉందని తెలుస్తోంది. అల్లరి నరేష్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. అల్లరి నరేష్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. నరేష్ సినిమాలకు ఓటీటీలలో సైతం మంచి రెస్పాన్స్ వస్తోంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.