March 23, 202508:25:17 AM

Balakrishna, Bobby: బాలయ్య బాబీ మూవీ షూట్ గురించి షాకింగ్ అప్ డేట్.. ఏం జరిగిందంటే?

బాలయ్య (Balakrishna)  బాబీ (Bobby) కాంబో మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సగ భాగం షూటింగ్ ను ఈ సినిమా పూర్తి చేసుకోగా త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి త్వరలో పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులోని రాక్ గార్డెన్స్ లో జరుగుతుండటం గమనార్హం. బాలయ్య నటించిన ఎన్నో సినిమాలు కర్నూలు జిల్లాలోని వేర్వేరు ప్రాంతాలలో షూట్ జరుపుకొని బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.

ఈ సెంటిమెంట్ ప్రకారం బాలయ్య బాబీ మూవీ కూడా హిట్టేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. శ్రద్ధా శ్రీనాథ్ (Shradha Srinath), ఊర్వశి రౌతేలా (Urvashi Rautela)  ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తుండగా ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు సంబంధించి సమాధానాలు తెలియాల్సి ఉంది. చాందిని చౌదరి (Chandini Chowdary)సైతం ఈ సినిమాలో క్రేజీ రోల్ లో నటిస్తున్నారని తెలుస్తోంది. బాలయ్య బాబీ కాంబో మూవీ 120 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

బాలయ్య బాబీ కాంబో మూవీ ఇండస్ట్రీని షేక్ చేసే రేంజ్ లో హిట్ కావాలని ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య డబుల్ హ్యాట్రిక్ కు ఈ మూవీతో శ్రీకారం చుడతారేమో చూడాల్సి ఉంది. బాలయ్య బాబీ కాంబో మూవీ బిజినెస్ పరంగా కూడా అదరగొడుతోందని తెలుస్తోంది. బాలయ్య సినిమాల సీడెడ్ హక్కులకు ఊహించని స్థాయిలో డిమాండ్ నెలకొందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

బాలయ్య బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్ లో అఖండ2 (Akhanda)  తెరకెక్కనుండగా త్వరలో ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్ డేట్స్ రానున్నాయి. బాలయ్య 30 నుంచి 34 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.