March 24, 202501:23:05 AM

Bhaje Vaayu Vegam Collections: ‘భజే వాయు వేగం’ 2 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

‘ఆర్.ఎక్స్.100’ హీరో కార్తికేయ (Karthikeya).. ఆ తర్వాత చాలా సినిమాలు చేశాడు కానీ, ఏది కూడా దాని రేంజ్లో బ్లాక్ బస్టర్ కాలేదు. ‘బెదురులంక 2012 ‘(Bedurulanka 2012) గత ఏడాది రిలీజ్ అయ్యి డీసెంట్ సక్సెస్ అందుకుంది కానీ అది ‘ఆర్.ఎక్స్.100’ రేంజ్ సక్సెస్ కాదు. ఇక అతను హీరోగా రూపొందిన ‘భజే వాయు వేగం’ (Bhaje Vaayu Vegam) అనే మూవీ మే 31 న రిలీజ్ అయ్యింది. యూవీ కాన్సెప్ట్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రానికి ప్రశాంత్ రెడ్డి దర్శకుడు. రథన్(Radhan) సంగీతం అందించిన ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్ (Iswarya Menon)  హీరోయిన్ గా నటించింది.

మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేదు.అయితే 2వ రోజు పర్వాలేదు అనిపించింది. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.55 cr
సీడెడ్ 0.11 cr
ఉత్తరాంధ్ర 0.16 cr
ఈస్ట్ 0.06 cr
వెస్ట్ 0.04 cr
గుంటూరు 0.12 cr
కృష్ణా 0.09 cr
నెల్లూరు 0.03 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.16 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.08 cr
 ఓవర్సీస్ 0.08 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 1.32 cr (షేర్)

‘బెదురులంక 2012’ చిత్రానికి రూ.4.45 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.2 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.1.32 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.3.48 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.