March 26, 202509:14:49 AM

Bhaje Vaayu Vegam OTT: కార్తికేయ కొత్త సినిమా ఓటీటీకి వచ్చేస్తోంది.. ఎందులో? ఎప్పుడు?

చాలా రోజులుగా మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న కార్తికేయ గుమ్మకొండకు (Kartikeya) ‘బెదురులంక’ (Bedurulanka 2012) లాంటి హిట్‌ దొరికింది. ఆ తర్వాత హిట్‌ స్ట్రీక్‌ను కొనసాగిస్తాడా? లేదా? అనే ప్రశ్నతో ‘భజే వాయు వేగం’ (Bhaje Vaayu Vegam) అనే సినిమా వచ్చింది. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో ఆశించిన ఫలితాన్నే అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కి రంగం సిద్ధమైంది. మే 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మరో ఐదు రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తోంది.

నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమాను జూన్‌ 28 నుండి స్ట్రీమ్‌ చేయనున్నారని టక్‌. ఇప్పటివరకు ఈ విషయంలో అధికారిక సమాచారం లేకపోయినా ఒకట్రెండు రోజుల్లో అనౌన్స్‌ చేస్తారు అని అంటున్నారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ అనే బ్యానర్‌పై సినిమా రూపొందింది. క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో యాక్షన్ ఓరియెంటెడ్‌ సినిమాగా ఈ ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చి విజయం సాధించారు. ఇక సినిమా కథేంటంటే.. వరంగల్‌ సమీపంలోని రాజన్నపేటకు చెందిన కుర్రాడు వెంకట్‌ (కార్తికేయ) తల్లిదండ్రులు వ్యవసాయంలో నష్టంతో ఆత్మహత్య చేసుకుంటారు.

దీంతో వెంకట్‌.. రాజు (రాహుల్‌ టైసన్‌)తో (Rahul Haridas) కలసి పెరిగి పెద్దవాడవుతాడు. క్రికెటర్‌ అవ్వాలన్న టార్గెట్‌తో వెంకట్‌, ఉద్యోగం చేయాలన్న కోరికతో రాజు ఊరి నుండి హైదరాబాద్‌ వస్తారు. కానీ అనుకున్న లక్ష్యాల్ని అందుకోలేకపోతారు. దీంతో క్రికెట్‌ బెట్టింగ్‌లు వేస్తూ వెంకట్‌, స్టార్‌ హోటల్‌లో పనిచేస్తూ రాజు లైఫ్‌ ముందుకు సాగిస్తు ఉంటారు. ఆ సమయంలో రాజు తండ్రి అనారోగ్యం పాలవుతాడు. ఆయన్ను కాపాడుకోవడానికి రూ.20 లక్షలు ఖర్చవుతుందని తెలుస్తుంది.

దీంతో ఆ డబ్బు కోసం వెంకట్‌.. డేవిడ్‌ (రవిశంకర్‌) (K. Ravi Shankar) గ్యాంగ్‌ దగ్గర బెట్టింగ్ కడతాడు. అయితే బెట్‌లో గెలిచినా.. గెలుచుకున్న రూ.40లక్షలు ఇవ్వడానికి డేవిడ్‌ మనుషులు ఒప్పుఓరు. మరి ఆ తర్వాత ఏమైంది? అనేది కథ. డేవిడ్‌ గ్యాంగ్‌, పోలీసుల నుండి వెంకట్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అసలు ఆ కారులో ఏమున్నాయి, ఎందుకు అందూ తన వెంట పడ్డారు. అప్పుడు ఏం జరిగింది అనేది ఆసక్తికరంగా ఉంటుంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.