March 29, 202504:20:14 PM

Ghajini Movie: సూర్య బ్లాక్‌బస్టర్‌ సినిమా వెనుక ఇంత జరిగిందా? అంతమంది నో ఎందుకు చెప్పారో?

సినిమా ఇండస్ట్రీలో తెరకెక్కిన ప్రతి సినిమా ఆ హీరో కోసం రాసింది కాదు అని చెప్పొచ్చు. హీరో ఓకే అయ్యాక రాసిన కథలు కూడా గతంలో వేరే హీరో కోసం ఆ కథకుడు, దర్శకుడు అనుకున్నవే అయి ఉండొచ్చు. కొన్ని సినిమా కథలు అయితే ఏకంగా పది పదిహేను మంది హీరోలను దాటి ఆ హీరో వరకు వచ్చి ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటి ‘గజిని’. అవును సూర్య (Suriya) నటించిన సినిమా గురించే ఇదంతా.

సూర్య – మురుగదాస్‌ (A.R. Murugadoss) కాంబినేషన్‌లో సాధారణ సినిమాగా వచ్చిన ఈ చిత్రం.. విడుదలైన తర్వాత సంచలనాలు సృష్టించింది. ఎంతగా అంటే బాలీవుడ్‌ నుండి ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan) వచ్చి సినిమా కథను నేను కూడా చేస్తాను అనేంత విజయం సాధించింది. అయితే ఇలాంటి విజయం సూర్యకు కాకుండా వేరే హీరోకు దక్కాల్సింది అనే విషయం తెలుసా? ఇదేదో పుకారు అనుకునేరు. దర్శకుడు మురుగదాసే ఈ విసయం చెప్పారు.

ఓ హీరో రిజక్ట్ చేసిన సినిమాతో మరో హీరో హిట్ కొట్టడం ఓకే.. బ్లాక్‌ బస్టర్‌ సాధించడం అంటే చాలా పెద్ద విసయం. అలాంటి హీరోల్లో క‌మ‌ల్‌ హాసన్‌ (Kamal Haasan), ర‌జనీ కాంత్ (Rajinikanth) , విజ‌య్ కాంత్‌ , విజ‌య్ (Vijay Thalapathy) లాంటి తమిళ హీరోలు.. మహేష్ బాబు (Mahesh Babu) , పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లాంటి తెలుగు స్టార్‌ హీరోలు కూడా ఉన్నారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సూర్య కంటే ముందు మురుగదాస్‌ తన కథను పై హీరోలతోపాటు మరికొంతమంది స్టార్లకు వినిపించారు.

మొత్తంగా 12 మంది రిజెక్ట్‌ చేసిన, నో అనుకున్న కథను సూర్య ఓకే చేసి బ్లాక్‌ బస్టర్‌ కొట్టాడు. అదే పై హీరోల్లో ఎవరన్నా చేసి ఉంటే వాళ్లకున్న ఇమేజ్‌తో ఇంకా భారీ విజయం అందుకునేదని చెప్పొచ్చు. ఏం చేస్తాం ఎవరికి రాసిపెట్టి ఉన్న హిట్‌ వారికి దక్కుతుంది. ‘గజిని’ విజయం సూర్యకు రాసి పెట్టింది అంతే.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.