March 27, 202510:32:20 PM

హీరోలతో ఫ్రెండ్లీగా ఉండాలని సలహాలు.. స్టార్‌ హీరోయిన్‌ షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్, బాలీవుడ్ ఇతర ఇండస్ట్రీలలో నటిగా ఇషా కొప్పికర్ (Isha Koppikar) తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. క్యాస్టింగ్ కౌచ్ గురించి ఇషా కొప్పికర్ సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నాకు 22 సంవత్సరాల వయస్సు ఉన్న సమయంలో ఒక స్టార్ హీరో ఒంటరిగా ఇంటికి రమ్మని పిలిచాడని ఆమె తెలిపారు. కెరీర్ తొలినాళ్లలోనే ఇలాంటి చేదు అనుభవం ఎదురైందని ఇషా పేర్కొన్నారు. తనను ఇంటికి పిలిచిన ఆ పెద్ద నటుడికి కొన్ని ఎఫైర్లు ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు.

నా స్టాఫ్ వస్తే గాసిప్స్ పుట్టిస్తారని అందువల్ల ఒంటరిగా రావాలని ఆ నటుడు నాకు సూచించాడని ఇషా కొప్పికర్ పేర్కొన్నారు. నేను దానికి ఒప్పుకోలేదని ఒంటరిగా రాలేనని చెప్పేశానని ఆమె చెప్పుకొచ్చారు. అతడి పేరు చెప్పడానికి మాత్రం ఇషా కొప్పికర్ ఇష్టపడలేదు. 18 సంవత్సరాల వయస్సులో సైతం ఈ తరహా అనుభవం ఒకటి ఎదురైందని ఆమె పేర్కొన్నారు. హీరో సెక్రటరీ నా దగ్గరికొచ్చిందని హీరోతో కొంచెం ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పిందని ఆమె తెలిపారు.

నేను ఫ్రెండ్లీగానే ఉంటానని సెక్రటరీకి బదులిచ్చానని ఇషా కొప్పికర్ పేర్కొన్నారు. ఆ సమయంలో సెక్రటరీ నిన్ను ఎవరైనా అభ్యంతరకరంగా తాకారా అని అడగగా లేదని చెప్పానని ఆమె అన్నారు. హీరో అలా తాకినా కూడా సర్దుకోవాలని సెక్రటరీ చెప్పిందని ఇషా కొప్పికర్ వెల్లడించారు. ఆ సమయంలో అలాంటి ఫ్రెండ్లీ నేచర్ నాకు లేదని చెప్పానని ఆమె పేర్కొన్నారు.

ఇషా కొప్పికర్ 16 సంవత్సరాల క్రితం తన బాయ్ ఫ్రెండ్ ట్రిమ్మీ నారంగ్ ను పెళ్లి చేసుకోగా కొన్ని కారణాల వల్ల ఆమె భర్తతో విడిపోయారు. ఇషా కొప్పికర్ వయస్సు 47 సంవత్సరాలు కాగా ఆమె చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.