
అయితే కామెంట్లు.. లేదంటే స్కిన్ షోలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే ప్రయత్నం చేస్తుంటుంది యాంకర్ కమ్ యాక్టర్ అనసూయ. గత కొన్నేళ్లుగా ఆమె ఇదే పని చేస్తూ వస్తోంది. ఒకవేళ ఆమె కామెంట్లు చేయకపోతే అవతలి వ్యక్తులు ఏదో ఒకటి అని ఆమె రియాక్ట్ అయ్యేలా చేస్తున్నారు. వాళ్లు కూడా ఏమీ అనకపోతే ఎప్పుడు ఏదో ఒకట అనే నెటిజన్లు ఆ పని చేస్తున్నారు. తాజాగా ఎవరేమన్నారో కానీ.. అనసూయ ( Anasuya Bhardhwaj) ఉగ్రరూపం దాల్చింది.
పైన చెప్పినట్లు ఎవరిని ఉద్దేశించి అందో తెలియదు కానీ.. ‘‘మరీ ఇంత చేతకానివాళ్లలా ఉంటే ఎలా? నాపై కాదు.. మీకు దమ్ముంటే నేను ఏం చేసినా ఆ టాపిక్ లాగేవారిని అనండి. కానీ మీరు అలా చేయరు, చేయలేరు. ఎందుకంటే మీకు చేతకాదు. మీ హీరోలా ఆడవారిని ఉద్దేశించి దుర్భాషలాడడం మాత్రమే వచ్చు కదా పాపం. మీరంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’’ అంటూ కౌంటర్లతో కలిపిన మెసేజ్‌ను పెట్టింది.
ఈ పోస్టు మొత్తం చదివితే ఏ హీరో గురించి, ఎవరి అభిమానుల గురించి మాట్లాడిందో అర్థమవుతుంది. గతంలో ఓ యువ హీరోని ఉద్దేశించి అనసూయ ఓ పోస్ట్ పెట్టడంతో దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అతని గురించి, అతని అభిమానుల గురించే ఈ పోస్టు అని అంటున్నారు నెటిజన్లు. ఇటీవల జరిగిన ‘సింబా’ ప్రచారంలో ఆమె ఆ హీరో గురించి రియాక్ట్ అయింది. అందుకు ఆమెను ఎవరన్నా ఏమన్నా అన్నారేమో.
నిజానికి ఆ హీరోకు, అనసూయకు రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. మామూలుగా అయితే ఆ హీరో సినిమా రిలీజ్‌కు ముందు ఈ చర్చ జరుగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ హీరో సినిమా రిలీజ్ కూడా లేదు. మరిప్పుడు ఎందుకు ఈ చర్చ బయటకు వచ్చింది అనేది అర్థం కావడం లేదు. అయితే ఇప్పుడు అనసూయ సినిమా రిలీజ్‌కి ఉంది.