March 26, 202508:32:00 AM

Dimple Hayathi: డింపుల్ హయతి గ్రేటే.. ఎందుకంటే?

డింపుల్ హయాతి (Dimple Hayathi) .. పరిచయం అవసరం లేని పేరు.తెలుగు అమ్మాయే. ‘గల్ఫ్’, ‘గద్దలకొండ గణేష్’ (Gaddalakonda Ganesh) , ‘యురేక’ ‘సామాన్యుడు’ వంటి సినిమాలతో బాగా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత రవితేజకి (Ravi Teja) జోడీగా ఖిలాడి (Khiladi) సినిమాలో చేసే ఛాన్స్ కొట్టేసింది. అదే టైంలో ఈమెకు ‘రామబాణం’ లో గోపీచంద్ (Gopichand) సరసన నటించే ఛాన్స్ కూడా దక్కింది. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా నిరాశపరిచాయి. ‘ఖిలాడి’ లో డింపుల్ గ్లామర్ ప్రేక్షకుల్ని ఎట్రాక్ట్ చేసింది.

కానీ ‘రామబాణం’ (Ramabanam) ఈమెకు ఏమాత్రం కలిసి రాలేదు. పైగా ఈ సినిమాలో ఆమె గోపీచంద్ కంటే ఆమె ఎక్కువ బరువు ఉన్నట్లు కనిపించడంతో విమర్శల పాలైంది. ఆ తర్వాత ఆమెకు మరో సినిమాలో ఛాన్స్ దక్కలేదు. మధ్యలో ఓ పోలీస్ ఆఫీసర్ తో గొడవ పెట్టుకుని వార్తల్లో నిలిచింది.అది పెద్ద కాంట్రోవర్సీ అయ్యింది. బహుశా ఆ గొడవ వల్లే కాబోలు ఈమెకు అవకాశాలు రావడం లేదు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అది నిజమో కాదో తెలీదు. ఒకవేళ నిజమే అయితే డింపుల్ చేసేది కూడా ఏమీ ఉండదు. అయితే ముందుగా బరువు తగ్గడం అనేది ఆమె బాధ్యత. అందుకే జిమ్ లో గ్యాప్ లేకుండా కసరత్తులు చేస్తుంది. అందులో భాగంగా ఈమె 17 రోజుల్లో 3 కేజీలు తగ్గిందట. ఆ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా తెలిపింది. బరువు పెరిగితే సర్జరీలు వంటివి చేసి తగ్గిపోయే హీరోయిన్లు ఉన్న ఈ రోజుల్లో.. ఇలా కష్టపడి వర్కౌట్లు చేసి తగ్గే పని పెట్టుకున్నందుకు డింపుల్ ని అభినందించాల్సిందే.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.