March 29, 202505:45:08 AM

Game Changer: హమ్మయ్య లాస్ట్‌ షెడ్యూల్‌ అట… చరణ్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌!

శంకర్‌తో (Shankar) సినిమా అంటే బడ్జెట్‌ విషయంలోనే కాదు.. షూటింగ్‌ డేస్‌ విషయంలోనూ రాజీ పడటానికి లేదు అని అంటుంటారు. కొన్నేళ్ల పాటు సినిమాను చెక్కే దర్శకుల్లో ఆయనొకరు. అలా ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) సినిమా పట్టాలెక్కుతోంది అని వార్తలొచ్చినప్పుడు.. ‘ఈ సినిమా ఎన్ని రోజులో?’ అనే ప్రశ్న వచ్చింది. అయితే ‘ఈసారి పక్కా ప్లాన్‌తో వెళ్తున్నారు. అనుకున్న టైమ్‌కి అయిపోద్ది’ అని దిల్‌ రాజు కాంపౌండ్‌ చెప్పింది. కట్‌ చేస్తే.. ఇప్పటివరకు సినిమా అవ్వలేదు.

సినిమా ప్రారంభం అయిన కొత్తల్లో అభిమానులు ఈ సినిమా అప్‌డేట్స్‌ కోసం వెయిట్‌ చేశారు. ఇప్పుడు షూటింగ్‌ షెడ్యూల్‌ ఎప్పుడు అని వెయిట్‌ చేస్తున్నారు. ముందు షూట్‌ అయితే అప్‌డేట్స్‌ అడుగుదాం అనుకున్నారు. మీరు కూడా ఇలాంటి జాబితాలో ఉంటే మీకో షాకింగ్‌ న్యూస్‌. ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా షూటింగ్‌ను ముగించేందుకు రామ్‌చరణ్‌ (Ram Charan ) , శంకర్‌ సిద్ధమవుతున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ ఈ వారం నుండి రాజమహేంద్రవరంలో మొదలు కానున్నట్లు సమాచారం.

వారంపాటు సాగనున్న ఈ షెడ్యూల్‌లో సినిమా చిత్రీకరణ పూర్తి అవుతుంది అని అంటున్నారు. దీంతో ఏంటీ.. షూటింగ్‌ అయిపోతోందా అని చరణ్‌ ఫ్యాన్సే షాక్‌ అవుతున్నారు. అయితే ప్యాచ్‌ వర్క్‌ కాస్త ఉండొచ్చు అని సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే దీపావళి కానుకగా అక్టోబరు నెలాఖరున సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అప్పటికల్లా శంకర్‌ పనులు పూర్తి చేస్తారా? లేదా? అనేది చూడాలి.

ఇక పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ముస్తాబవుతోన్న ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ రెండు కోణాలున్న పాత్రలో నటిస్తున్నాడు. ఒక పాత్రలో రాజకీయ నాయకుడు అయితే, రెండో పాత్రలో ఎన్నికల కమిషనర్‌ అని అంటున్నారు. ఇక దిల్‌ రాజు (Dil Raju) నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అడ్వాణీ (Kiara Advani) కథానాయిక. అంజలి (Anjali), ఎస్‌.జె.సూర్య SJ Suryah), శ్రీకాంత్‌ (Srikanth) ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.