April 2, 202503:48:52 AM

Harom Hara First Review: సుధీర్ బాబు ‘హరోం హర’ ఫస్ట్ రివ్యూ… ఎలా ఉందంటే?

సుధీర్ బాబు  (Sudheer Babu)  కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేక అల్లాడుతున్నాడు.అతను ఎంతో ఇష్టపడి చేసిన ‘హంట్’ (Hunt) ‘మామా మశ్చీంద్ర'(Mama Mascheendra) తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో ఎలాగైనా హిట్టు కొట్టాలనే తలంపుతో ‘హరోం హర’ (Harom Hara) చేశాడు. ‘శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్’ బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు  (Sumanth G Naidu) నిర్మించిన ఈ చిత్రాన్ని ‘సెహరి’ (Sehari)  ఫేమ్ జ్ఞాన సాగర్ ద్వారక (Gnanasagar Dwaraka) డైరెక్ట్ చేశాడు. జూన్ 14 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నైజాంలో రిలీజ్ చేస్తుంది.

టీజర్, ట్రైలర్.. సినిమాపై ఆసక్తిని పెంచే విధంగా ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలకు ఈ చిత్రాన్ని స్పెషల్ షో వేసి చూపించారు మేకర్స్. వారి టాక్ ప్రకారం… ‘హరోం హర’ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుందట. మొదటి 15 నిమిషాలు.. ఇంటర్వెల్ సీక్వెన్స్ హైలెట్ గా ఉంటాయని… సెకండ్ హాఫ్ కూడా చాలా రేసీగా సాగుతుందట. అయితే క్లైమాక్స్ 15 నిమిషాలు రొటీన్ గా అనిపిస్తుందని..!

కానీ కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకుల నుండి డీసెంట్ టాక్ ను రాబట్టుకుంటుంది చెప్పుకొచ్చారు. అంతేకాదు సుధీర్ బాబు ఈ సినిమాలో కంప్లీట్ మాస్ రోల్లో కనిపించాడట. ఎప్పటిలానే యాక్షన్ సీన్స్ లో అదరగొట్టాడని అంటున్నారు. చాలా కాలం తర్వాత అతనికి సరైన యాక్షన్ మూవీ ‘హరోం హర’ రూపంలో పడింది అని తెలుస్తుంది. సునీల్ రోల్ కూడా హైలెట్ గా ఉంటుందట.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.