March 26, 202508:45:58 AM

Kajal Aggarwal: సౌత్ లో పెళ్లైన హీరోయిన్లకు ఇలాంటి పరిస్థితా.. కాజల్ ఏమన్నారంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత వరుస ఆఫర్లను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ కు రెమ్యునరేషన్ ఇప్పుడు కూడా భారీ స్థాయిలోనే ఉంది. బాలీవుడ్ ఇండస్ట్రీ, సౌత్ ఇండస్ట్రీ మధ్య చాలా తేడా ఉందని కాజల్ అగర్వాల్ అన్నారు. సౌత్ లో పెళ్లైన హీరోయిన్లను బాగా లేరని పక్కన పెట్టేస్తారని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం పెళ్లైన హీరోయిన్లు సైతం హీరోయిన్లుగా కెరీర్ ను విజయవంతంగా కొనసాగిస్తున్నారని కాజల్ వెల్లడించారు.

దీపికా పదుకొనే (Deepika Padukone) , అలియా భట్ (Alia Bhatt) లాంటి వాళ్లకు హీరోయిన్లుగా ఆఫర్లు వస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. సౌత్ ఇండియాలో మాత్రం అలాంటి పరిస్థితి లేదని కాజల్ చెప్పుకొచ్చారు. నయనతార (Nayanthara) మాత్రం ఈ పరిస్థితికి అతీతం అని ఆమె కామెంట్లు చేశారు. నయనతార మంచి సినిమాలు చేస్తోందని సౌత్ లో నెలకొన్న ఈ పరిస్థితిని త్వరలో మారుద్దాం అని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చారు.

అయితే కాజల్ అగర్వాల్ చేసిన కామెంట్ల విషయంలో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాజల్ అగర్వాల్ క్రేజ్, రేంజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండగా ఆమె మరింత సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరో రెండు రోజుల్లో కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. సత్యభామ (Satyabhama) సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఒకింత భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కింది. సత్యభామ సినిమా సక్సెస్ సాధిస్తే కాజల్ అగర్వాల్ కెరీర్ పుంజుకునే అవకాశాలు అయితే ఉంటాయి. కాజల్ అగర్వాల్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగాలని అభిమానులు కోరుకుంటున్నారు. సీనియర్ స్టార్ హీరోలు కాజల్ అగర్వాల్ కు ఛాన్స్ ఇస్తే ఆమె కెరీర్ వేగంగా పుంజుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.