March 26, 202508:32:00 AM

Pawan Kalyan: ఆ రెండూ ఎంతో ప్రత్యేకం అంటున్న పవన్.. ఏం జరిగిందంటే?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఏపీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దేశ రాజకీయాల్లో కనీవిని ఎరుగని విజయం జనసేనకు సొంతం కావడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించడం సులువైన విషయం కాకపోయినా పవన్ మాత్రం అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. తన గెలుపు గురించి మాట్లాడుతూ పవన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

నా లైఫ్ లో ఇప్పటివరకు సక్సెస్ ఏంటో తెలియదని సినిమాల్లో ఉన్న సమయంలో తొలిప్రేమ విజయం సంతోషాన్ని అందించిందని నా లైఫ్ అంతా దెబ్బలు తింటూ మాటలు పడుతూ అవమానాలతో గడిచిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నేను ఫెయిల్యూర్ ను చూసి భయపడనని ఫెయిల్యూర్ కూడా ఉత్సాహాన్ని ఇస్తుందని ధర్మం కోసం నిలబడితే ధర్మమే మనల్ని రక్షిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.

అప్పుడు తొలిప్రేమ (Tholi Prema) విజయం ఇప్పుడు 21 సీట్ల విజయం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పవన్ పేర్కొన్నారు. నాకు ఆకాశమంత ధైర్యాన్ని ఇచ్చారని మీ ఇంట్లో ఒకడిగా ఉంటానని ఆయన వెల్లడించారు. మీ శ్రేయస్సు కొరకు త్వరలో అసెంబ్లీలో అడుగు పెడతానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ కావడంతో పాటు ఫ్యాన్స్ కు సంతోషాన్ని, ఉత్సాహాన్ని కలిగించాయి.

పవన్ కళ్యాణ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను ఈ ఏడాదే పూర్తి చేయనున్నారని సమాచారం అందుతోంది. పవన్ కళ్యాణ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. పవన్ సినిమాలు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు సాధించడంతో పాటు పవన్ రేంజ్ ను మరింత పెంచాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పవన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. సినిమాలు, రాజకీయాల్లో సాధించిన విజయాలు తనకు ఎంతో స్పెషల్ అని పవన్ చెబుతున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.