April 1, 202503:00:43 AM

Kalki 2898 AD First Review: ‘కల్కి..’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) , ‘మహానటి’ (Mahanati) వంటి బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) కలయికలో ‘కల్కి 2898 ad ‘ (Kalki 2898 AD) అనే భారీ బడ్జెట్ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. మరో 2 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం టికెట్ల కోసం సోషల్ మీడియాలో ఏ రేంజ్ డిస్కషన్స్ నడుస్తున్నాయో అందరికీ తెలిసిందే. ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై అశ్వినీదత్  (C. Aswani Dutt) ఈ చిత్రాన్ని రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు.

అశ్వినీదత్ కూతుర్లు అయిన ప్రియాంక దత్(Priyanka Dutt) , స్వప్న దత్ (Swapna Dutt)..లు కూడా సహా నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా గ్లింప్స్, ట్రైలర్, రిలీజ్ ట్రైలర్.. సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇప్పటికే ‘కల్కి 2898 ad ‘ టీం ఇండస్ట్రీలో ఉన్న తమ సన్నిహితులకు స్పెషల్ షో వేయడం జరిగింది. సినిమా చూసిన వారిలో కొంతమంది తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. సినిమాలో 9 రకాల యుద్దాలకి సంబంధించిన ఎపిసోడ్స్ ఉంటాయట. కలియుగంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయి..

‘కల్కి..’ ఎలా వస్తాడు? అనే పాయింట్ చుట్టూ కథ తిరుగుతుందట. సినిమాలో విజువల్స్ అద్భుతంగా ఉంటాయట. కథలో భాగంగా వచ్చే బిట్ సాంగ్స్ కూడా గూంజ్ బంప్స్ తెప్పిస్తాయట. ప్రభాస్ డైనమిక్ ప్రెజెన్స్ హైలెట్ అని.. క్లైమాక్స్ లో వచ్చే ఎపిసోడ్స్ సర్ప్రైజింగ్ గా అనిపిస్తాయని అంటున్నారు. మొత్తంగా ‘కల్కి..’ సినిమా ఓ గొప్ప అనుభూతి అని, అంతకు మించి ఏం చెప్పినా తక్కువే అవుతుందని వారు చెప్పుకొచ్చారు. మరి సినిమా వారు చెప్పిన స్థాయిలో ఉంటుందో లేదో తెలియాల్సి ఉంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.