March 28, 202502:47:13 PM

Kalki 2898 AD: కల్కి సినిమాలో ప్రభాస్ తల్లి పాత్రలో ఆ బ్యూటీ కనిపిస్తారా?

కల్కి (Kalki 2898 AD) మూవీ థియేటర్లలో రిలీజ్ కావడానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉండగా ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు సంబంధించి వార్తలు వైరల్ అయిన స్థాయిలో మరే సినిమాకు సంబంధించి వార్తలు ప్రచారంలోకి రాలేదు. ఈ సినిమాలో ప్రభాస్  (Prabhas)  భైరవ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. సినిమాలో భైరవ చిన్నప్పటి పాత్ర తల్లిగా మృణాల్ ఠాకూర్ కనిపిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) నిజంగా అంత ధైర్యం చేసిందా అనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అన్ని భాషల్లో రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా రిలీజవుతోంది. కొత్తగా ఓపెన్ చేసిన అపర్ణ సినిమాస్ మల్టీప్లెక్స్ లో కల్కి 42 షోలు ప్రదర్శితం కానుండగా అన్ని షోలకు సంబంధించి టికెట్లు అమ్ముడయ్యాయి. కల్కి 2898 ఏడీ సినిమాలో ప్రతి పాత్ర వెనుక దర్శకుడు ఎంతో కసరత్తు చేశారని తెలుస్తోంది.

ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయకపోయినా ప్రభాస్ గత సినిమాల రికార్డులను బ్రేక్ చేసే స్థాయిలో ఈ సినిమాకు బుకింగ్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ హాఫ్ క్లాస్ గా సెకండాఫ్ మాస్ గా ఉంటుందని తెలుస్తోంది. ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కిన కల్కి ఫ్యాన్స్ ను మెప్పించేలా ఉండనుందని సమాచారం అందుతోంది. ఏపీలోని కొన్ని ఏరియాలలో కల్కి మూవీ బుకింగ్స్ ఇంకా మొదలుకాకపోవడం సంచలనం అవుతోంది.

కల్కి సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉండటం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది. కల్కి 2898 ఏడీ ప్రభాస్ ఫ్యాన్స్ ను మెప్పిస్తే మాత్రం ఈ ఈ సినిమా సాధించే కలెక్షన్లు మరో స్థాయిలో ఉంటాయి. ఏపీలో రెండు వారాల వరకు ఈ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించడం గమనార్హం.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.