March 22, 202506:33:43 AM

Kannappa Teaser: ‘కన్నప్ప’ టీజర్ రూపంలో మంచు విష్ణు కెరీర్లో రేర్ రికార్డ్..!

మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా ‘కన్నప్ప’ (Kannappa) అనే భారీ బడ్జెట్ సినిమా రూపొందుతుంది. వంద కోట్ల భారీ బడ్జెట్ తో మంచు విష్ణునే ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రభాస్, (Prabhas) , అక్షయ్ కుమార్ (Akshay Kumar) , మోహన్ లాల్ (Mohanlal) , శివరాజ్ కుమార్(Shiva Rajkumar), కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) వంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. దీంతో సినిమాపై మొదటి నుండి మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇటీవల ‘కన్నప్ప’ టీజర్ ను వదిలింది చిత్ర బృందం.

అయితే అది అంచనాలను అందుకోలేదు. ఒక్క ప్రభాస్ కళ్ళు చూపించిన విధానం తప్ప.. మరో హైలెట్ లేదు ఆ టీజర్లో అంటే అతిశయోక్తి అనిపించుకోదు. పైగా టీజర్ చివర్లో మంచు విష్ణు ‘శివయ్యా..’ అంటూ పలికే డైలాగ్ ని విమర్శిస్తూ చాలా ట్రోల్స్ వచ్చాయి.భారీ బడ్జెట్ తో తీస్తున్న సినిమా అయినప్పటికీ.. విజువల్స్ ఇంత పేలవంగా ఉండటంతో అందరూ పెదవి విరిచారు. అయితే ఇంత ట్రోల్ చేసినప్పటికీ ‘కన్నప్ప’ టీజర్ ఓ రేర్ ఫీట్ ను సాధించింది.

అవును ‘కన్నప్ప’ టీజర్ 30 మిలియన్ రియల్ టైం వ్యూస్ ను కొల్లగొట్టి రికార్డు సృష్టించింది. అందులో 20 మిలియన్ యూట్యూబ్ నుండి వచ్చాయి. మిగిలినవి ఫేస్ బుక్ వంటి ఛానల్స్ ద్వారా వచ్చినట్లు తెలుస్తుంది. మంచు విష్ణు కెరీర్లో ఇలాంటి రికార్డు కొట్టిన టీజర్ ‘కన్నప్ప’ మాత్రమే..! అది కూడా ఇందులో స్టార్స్ ను చూపిస్తారనే ఆశతో చాలా మంది వీక్షించి ఉండొచ్చు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.