March 28, 202503:18:25 AM

Legend Saravanan: లుక్స్ మార్చుకుని మరో సినిమాకు ఓకే చెప్పిన శరవణన్.. సక్సెస్ దక్కుతుందా?

ది లెజెండ్ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి శరవణన్ గతంలో వార్తల్లో నిలిచారు. ఈ సినిమాపై వచ్చిన స్థాయిలో ట్రోల్స్ మరే సినిమాపై రాలేదనే సంగతి తెలిసిందే. సినిమాలో శరవణన్ ఎమోషనల్ సీన్స్ లో నటించినా ఆ సీన్స్ నవ్వు తెప్పించేలా ఉన్నాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమయ్యాయి. అయితే లుక్స్ మార్చుకుని మరో సినిమాతో శరవణన్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వ్యాపారవేత్తగా ఊహించని స్థాయిలో సక్సెస్ అయిన శరవణన్ దురై సెంథిల్ కుమార్ డైరెక్షన్ లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు సైతం ముగిశాయి. డ్రెస్సింగ్ మార్చి గడ్డం, మీసాలు పెంచి సరికొత్త లుక్ లో శరవణన్ కనిపిస్తుండగా ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులు ఈ మూవీ కోసం పని చేసే టెక్నీషియన్లకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. యాక్టింగ్ తో శరవణన్ ఈ సినిమాలో అయినా మెప్పిస్తారా? లేదా? అనే చర్చ జరుగుతుండటం గమనార్హం.

గతంలో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్త పడితే మాత్రం శరవణన్ కోరుకున్న సక్సెస్ దక్కడం సులువేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. శరవణన్ తన సినిమాలకు తానే నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండటంతో క్వాలిటీ విషయంలో రాజీ పడటం లేదని తెలుస్తోంది. శరవణన్ సినిమా రంగంపై ఆసక్తి ఉంటే నిర్మాతగా కెరీర్ ను కొనసాగిస్తే బాగుంటుందని కొంతమంది ఉచిత సలహాలు ఇస్తున్నారు.

గరుడన్ సినిమాతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న దురై సెంథిల్ కుమార్ ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. శరవణన్ యాక్టింగ్ కు సంబంధించి ట్రైనింగ్ తీసుకుని ఉంటే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. శరవణన్ టాలెంట్ ఉన్న డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వడం ద్వారా కెరీర్ పరంగా ఎదిగే దిశగా అడుగులు వేస్తున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.