March 31, 202509:21:21 AM

Nani: రెండు సినిమాలు ఒకేసారి.. నాని కొత్త ప్లాన్‌.. అయితే అవి ఏమైనట్లు?

ప్రస్తుతం నాని (Nani) ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram)  సినిమా పనులతో బిజీగా ఉన్నాడు. ఈ ఆగస్టులో సినిమాను రిలీజ్‌ చేయాలని టీమ్‌ ప్లాన్స్‌ వేస్తోంది. అయితే ఇప్పుడు ప్రశ్న నాని తర్వాత ఏ సినిమా చేస్తాడు అని. మామూలుగా అయితే నాని వెంట వెంటనే సినిమాలు చేసేలా లైనప్‌ సిద్ధం చేసుకుంటాడు. ఈ సారి కూడా అదే పని చేశాడు. కానీ ఇప్పుడు పరిస్థితి అంతా మారింది. ముందుగా అనుకున్న రెండు సినిమాలు ముందుకెళ్లేలా లేవు. వాటి స్థానంలో మరో రెండు సినిమాలు వచ్చాయి.

వివేక్‌ ఆత్రేయ (Vivek Athreya)  దర్శకత్వంలో రూపొందుతున్న ‘సరిపోదా శనివారం’ సినిమా తర్వాత నాని వెంటనే మరోసారి డీవీవీ దానయ్య (DVV Danayya)  నిర్మాణంలో సుజీత్‌ (Sujeeth) దర్శకత్వంలో ఓ సినిమా చేయాలి. అలాగే దిల్‌రాజు (Dil Raju) నిర్మాణంలో ‘బలగం’ (Balagam) వేణు (Venu Yeldandi) దర్శకత్వంలో ఓ సినిమా చేయాలి. ఈ మేరకు అనౌన్స్‌మెంట్‌ ఈ రోజో రేపో అనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ రెండు సినిమాలు వెనక్కి వెళ్లాయి అని అంటున్నారు.

ఎందుకంటే ఆ రెండు సినిమాల తర్వాత ఉంటాయి అని చెప్పిన ‘దసరా’(Dasara)   సినిమా ఫేమ్‌ శ్రీకాంత్‌ ఓదెల  (Srikanth Odela)  సినిమాను ఇప్పుడు ముందుకు తీసుకొస్తున్నారట. అలాగే ‘హిట్‌ 3’ సినిమా పనులను ప్రారంభించాలని శైలేష్‌ కొలనును  (Sailesh Kolanu) నాని అడిగినట్లు వార్తలొస్తున్నాయి. అంతేకాదు ఈ రెండు సినిమాల పనులను ఏక కాలంలో ముందుకు తీసుకుళ్లే ఉద్దేశంలో ఉన్నాడని కూడా సమాచారం అందుతోంది. ఈ లెక్కన ఇప్పుడు ఈ రెండు సినిమాలే నాని చేస్తాడు అని అంటున్నారు.

క్రైమ్‌ థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కే ‘హిట్‌’ (HIT) సినిమా సిరీస్‌కు మంచి ఫ్యాన్‌ బేసే ఉంది. మూడో ‘హిట్‌’లో అర్జున్‌ సర్కార్‌ అనే ఐపీఎస్‌ అధికారిగా నాని కనిపిస్తాడని ఇప్పటికే ‘హిట్‌ 2’  (HIT2)  సినిమా క్లైమాక్స్‌లో చెప్పేశారు. అలాగే ‘దసరా’లో నాని పాత్రకు భలే పేరొచ్చింది. ఇప్పుడు ఆ దర్శకుడితో చేసే సినిమాలో అంతకుమించి పాత్ర అంటున్నారు. సో ఆ రెండు లేకపోయినా.. ఈ రెండూ భలేగా ఉంటాయి అని చెప్పొచ్చు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.