
ఈ ఏడాది చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వారిలో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh), మీరా చోప్రా (Meera Chopra)..లతో పాటు దిల్ రాజు (Dil Raju) తమ్ముడి కొడుకు ఆశిష్ (Ashish Reddy) .. వంటి వారు ఉన్నారు. తాజాగా మరో హీరోయిన్ కూడా పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. హీరోయిన్ మీరా నందన్ పెళ్లి చేసుకున్నారు. గత ఏడాది క్రితం ఈమెకు పెళ్లైనట్టు ప్రచారం జరిగింది. కానీ అందులో నిజం లేదు.
ఈరోజు అనగా జూన్ 29 న మీరా నందన్ వివాహం జరిగింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.ఇదే క్రమంలో ఆమె పెళ్లి ఫోటోలను కూడా షేర్ చేసింది. మలయాళ నటి అయినప్పటికీ తెలుగులో ‘జై బోలో తెలంగాణ’ అనే సినిమాలో నటించి మెప్పించింది. ఆ తర్వాత హితుడు, ఫోర్త్ డిగ్రీ వంటి తెలుగు సినిమాల్లో కూడా నటించింది. మలయాళంలో ఓ యాంకర్‌గా కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె..
కొన్నాళ్ళకి సింగర్‌గా కూడా మారి తనలోని మరో కోణాన్ని బయటపెట్టింది. ఆ తర్వాత మెల్లగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తమిళ, తెలుగు, కన్నడ భాషల సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో పెద్దగా సినిమాలు లేవు. అందుకే పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చినట్టు స్పష్టమవుతుంది. మీరా నందన్ పెళ్లి ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram