March 25, 202511:21:25 AM

Naga Chaitanya: ఆ దర్శకుడు చైతన్యను మోసం చేశాడా.. ఫ్యాన్స్ అభిప్రాయమిదే!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ హీరోలలో నాగచైతన్య (Naga Chaitanya)  ఒకరు. నాగచైతన్య నటించిన క్లాస్ సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి. నాగచైతన్య కృతిశెట్టి (Krithi Shetty) కాంబినేషన్ లో వెంకట్ ప్రభు (Venkat Prabhu) డైరెక్షన్ లో తెరకెక్కిన కస్టడీ (Custody) మూవీ ఒకింత భారీ అంచనాలతో విడుదలై ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో ఫెయిలైంది. అయితే ఈ సినిమా ఫ్లాప్ కావడానికి దర్శకుడే కారణమని ఫ్యాన్స్ భావిస్తారు. అయితే విజయ్ (Thalapathy Vijay) గోట్ (GOAT) టీజర్ తాజాగా విడుదల కాగా వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

వెంకట్ ప్రభులో ఇంత టాలెంట్ ఉండి కూడా కస్టడీ సినిమాను ఏ మాత్రం ఆసక్తికరంగా ఎందుకు తెరకెక్కించలేకపోయారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. వెంకట్ ప్రభు చైతన్యను మోసం చేశాడని ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వెంకట్ ప్రభు తెలుగులో బ్రహ్మాండమైన అవకాశం వస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విషయంలో ఫెయిల్ అయ్యాడని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. చైతన్య సైతం కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది.

ప్రస్తుతం తండేల్ (Thandel) సినిమాలో నాగచైతన్య నటిస్తుండగా ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. తండేల్ సినిమా బాక్సాఫీస్ వద్ద కచ్చితంగా హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. తండేల్ సినిమా రియల్ లైఫ్ కథాంశంతో తెరకెక్కుతుండటంతో ఈ మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. తండేల్ ఎప్పుడు విడుదలైనా చైతన్య బెస్ట్ సినిమాలలో ఒకటిగా నిలుస్తుందని అభిమానులు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

నాగచైతన్య రెమ్యునరేషన్ 10 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంది. చైతన్య నటించిన దూత (Dhootha) వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. భవిష్యత్తులో చైతన్య మరిన్ని వెబ్ సిరీస్ లలో నటిస్తారేమో చూడాల్సి ఉంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.