Sushmita Konidela: అత్త నిన్ను చాలా లవ్ చేస్తుంది.. సుష్మిత కామెంట్స్ వైరల్!

చిరంజీవి (Chiranjeevi) మనవరాలు, చరణ్ (Ram Charan) ఉపాసనల కూతురు క్లీంకారకు సంబంధించి ఏ విషయం వెలుగులోకి వచ్చినా ఆ విషయం నెట్టింట తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. క్లీంకార పుట్టినరోజు వేడుకలు తాజాగా గ్రాండ్ గా జరగగా క్లీంకార ఫోటోలను ఫేస్ కవర్ చేయకుండా రివీల్ చేస్తారని చాలామంది భావించినా ఆ విధంగా జరగలేదు. అయితే సుష్మిత  (Sushmitha) సైతం క్లీంకార ఫేస్ ను కవర్ చేసిన కొన్ని ఫోటోలను ఫ్యాన్స్ తో పంచుకున్నారు.

“హ్యాపీ బర్త్ డే మై స్వీటెస్ట్.. అత్త నిన్ను చాలా లవ్ చేస్తుంది” అంటూ సుష్మిత సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. సుష్మితకు క్లీంకార అంటే ఎంత ఇష్టమో అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు. క్లీంకార ఫేస్ రివీల్ చేయకపోవడంతో ఒక నెటిజన్ “మీ బంగారాన్ని మీ ఇంట్లో దాచుకోండి మాకు ఎవరికీ చూపించకండి” అంటూ కామెంట్లు చేశారు.

రాబోయే రోజుల్లో అయినా క్లీంకార ఫోటో రివీల్ అవుతుందేమో చూడాల్సి ఉంది. సుష్మిత కొణిదెల షేర్ చేసిన ఈ ఫోటోలకు 38 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. క్లీంకార ఫోటోలను చూడటానికి అభిమానులు మాత్రం తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఫోటోలను రివీల్ చేయడం చరణ్, ఉపాసన ఇష్టం కనుక ఎప్పుడు రివీల్ చేస్తారో చెప్పే పరిస్థితి లేదు.

మరోవైపు చరణ్ స్పెషల్ ట్రైనింగ్ కోసం ఆస్ట్రేలియా వెళ్తున్నారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. బుచ్చిబాబు (Buchi Babu) సినిమా కోసం రామ్ చరణ్ ఈ ట్రైనింగ్ తీసుకుంటున్నారని వైరల్ అవుతున్న వార్తల సారాంశం. రామ్ చరణ్ వరుస బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుని ఫ్యాన్స్ కు మరింత సంతోషాన్ని కలిగించాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Sushmita (@sushmitakonidela)

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.