March 20, 202511:24:12 AM

Nani: శైలేష్ పై నానికి నమ్మకం తగ్గలేదుగా..!

‘హిట్’ (HIT) ‘హిట్ 2’ (HIT2) చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు శైలేష్ కొలను (Sailesh Kolanu) . వాటికి కొనసాగింపుగా ‘హిట్ 3’ ని కూడా అనౌన్స్ చేశాడు. నానినే దానిని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంది. అంతేకాదు ‘హిట్ 3 ‘ లో హీరో కూడా నానినే కావడం విశేషం. అయితే నాని వరుస సినిమాలతో బిజీగా ఉండటం. శైలేష్ కి వెంకటేష్ తో ‘సైందవ్’ (Saindhav) చేసే అవకాశం రావడంతో ‘హిట్ 3’ డిలే అయ్యింది.

సంక్రాంతికి రిలీజ్ అయిన ‘సైందవ్’ ప్లాప్ అవ్వడంతో.. ‘హిట్ 3 ‘ ఉండకపోవచ్చేమో అనే టాక్ కూడా రన్ అయ్యింది. శైలేష్ కూడా ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ లో సినిమాకి కమిట్ అవ్వడంతో.. ‘హిట్ 3’ మూలన పడిపోయినట్టే అని అంతా అనుకున్నారు. కానీ ఇన్సైడ్ టాక్ ప్రకారం.. నాని (Nani) ‘హిట్ 3’ లో నటించడానికి సిద్దంగానే ఉన్నాడట. ప్రస్తుతం ఆయన ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) అనే ఫాంటసీ మూవీలో నటిస్తున్నాడు.

దాని తర్వాత ‘దసరా’ (Dasara) ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో (Srikanth Odela) ఇంకో సినిమాకి కమిట్ అయ్యాడు. దీంతో సమాంతరంగా శైలేష్ కొలను ‘హిట్ 3 ‘ ని కూడా నాని స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి సెట్స్ పైకి వెళ్తే 70 రోజుల్లో ఫినిష్ చేసేలా ‘హిట్ 3 ‘ స్క్రిప్ట్ ను డిజైన్ చేసుకుంటున్నాడు శైలేష్. కథ ప్రకారం ఇందులో మరో హీరోకి కూడా ఛాన్స్ ఉందట. మరి ఆ రోల్ కి ఏ యంగ్ హీరోని తీసుకుంటారో చూడాలి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.