March 17, 202506:03:51 PM

ప్రయోగాల దర్శకుడు సినిమాలో మన బోల్డ్‌ బ్యూటీ.. ఎవరంటే?

రుహానీ శర్మ  .. ఈ పేరు వినగానే ఓన్లీ సినిమా లవర్స్‌కి ‘చి.ల.సౌ’, ‘హిట్‌’ (HIT), ‘సైంధవ్‌’ లాంటి సినిమాలుల, అందులో ఆమె పోషించిన పద్ధతైన పాత్రలు కనిపిస్తాయి. అదే ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను ఫాలో అయ్యేవాళ్లకు అయితే బోల్డ్‌ ఫొటో షూట్‌లు, అదిరిపోయే హాట్‌ పోజులు దర్శనమిస్తాయి. సినిమాకు, సోషల్‌ మీడియాకు ఆమెలో చాలా డిఫరెన్స్‌ కనిపిస్తుంది లెండి. అలాంటి భామ ఇప్పుడు కోలీవుడ్‌లో ఓ సినిమా ఓకే చేసింది. ప్రముఖ దర్శకుడు వెట్రి మారన్‌  (Vetrimaaran) నిర్మిస్తున్న ‘మాస్క్‌’ అనే సినిమాలో రుహానీ శర్మ(Ruhani Sharma) ఓ కథానాయికగా కనిపించనుంది.

‘డాడా’, ‘స్టార్‌’ లాంటి విజయాల తర్వాత కవిన్‌ హీరోగా నటిస్తున్న చిత్రమిది. వెట్రి మారన్‌ శిష్యుడు విక్రనన్‌ అశోక్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆండ్రియా ఓ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో మరో కథానాయికగా రుహానీ నటిస్తోంది. ఈ సినిమా సెట్స్‌లో ఆమె ఇటీవల అడుగుపెట్టింది. ఈ మేరకు ఓ వర్కింగ్‌ స్టిల్‌ సోషల్‌ మీడియాలో కనిపించింది. ఇదొక డార్క్‌ కామెడీ థ్రిల్లర్‌ సినిమా అని సమాచారం. వెట్రిమారన్‌ గత సినిమాలకు దగ్గరగా ఈ సినిమా ఉంటుంది.

ఆయన దర్శకుడు కాకపోయినా.. ఆయన ఫ్లేవర్‌లోనే ఈ సినిమా రూపొందుతోంది అని చెబుతున్నారు. ఈ ఏడాది చివరి నాటికి సినిమా చిత్రీకరణ పూర్తి చేసి.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తునర్నారట. ఇక ఈ ఏడాది రుహానీ శర్మ నుండి ఐదు సినిమాలు విడుదలయ్యాయి. ఏడాది ప్రారంభంలో వెంకటేశ్‌ (Venkatesh Daggubati) 75వ సినిమా ‘సైంధవ్‌’ (Saindhav) రాగా, ఆ తర్వాత వరుణ్‌తేజ్‌తో (Varun Tej) నటించిన ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ (Operation Valentine) సినిమా వచ్చింది.

ఇటీవల సుహాస్‌ (Suhas) నుండి వచ్చిన ‘శ్రీరంగ నీతులు’ (Sriranga Neethulu)  సినిమాలోనూ ఆమెనే నాయిక. ఆశిష్‌ రెడ్డి (Ashish Reddy) సినిమా ‘లవ్‌ మీ ఇఫ్‌ యూ డేర్‌’ (Love Me) సినిమాలో అతిథి పాత్రలో కనిపించిన రుహానీ.. విక్రాంత్‌ మస్సే ‘బ్లాక్‌ అవుట్‌’లో ఓ హీరోయిన్‌గా కనిపించి అలరించింది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.