April 3, 202505:55:57 AM

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కు వదినమ్మ ఇచ్చిన బహుమతి ఖరీదెంతో తెలుసా?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు (Pawan Kalyan)  డిప్యూటీ సీఎం పదవి రావడంతో పవన్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పవన్ పాలిటిక్స్ లో సాధించిన విజయాలు మెగా ఫ్యామిలీకి కలిగిస్తున్న సంతోషం అంతాఇంతా కాదు. పవన్ కు వదినమ్మ సురేఖ ఇచ్చిన పెన్నుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ పెన్ను ఖరీదు ఏకంగా 2,53,900 రూపాయలు కావడం గమనార్హం. పవన్ ఇకపై ఈపెన్నుతోనే సంతకాలు చేయనున్నారని సమాచారం అందుతోంది.

సురేఖ ఇచ్చిన గిఫ్ట్ చూసి ఒక పెన్ను ఖరీదు ఇన్ని లక్షలా అని నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ పెన్ను మోంట్ బ్లాంక్ డిస్నీ ఎడిషన్ పెన్ను కావడం గమనార్హం. “తెలుగు ప్రజల ఆకాంక్షల్ని నిజం చేస్తావని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ వదిన అన్నయ్య” అంటూ చిరంజీవి (Chiranjeevi) ఈ వీడియోను ముగించారు. వదినమ్మ నుంచి ఖరీదైన బహుమతి అందడంతో పవన్ కళ్యాణ్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

“కళ్యాణ్ బాబుకు వదినమ్మ బహుమతి” అంటూ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేయడం జరిగింది. “అంజనమ్మ అంత అదృష్టవంతురాలు ఈ భూమి మీద ఇంకొకరు వుండరు” అంటూ ఒక అభిమాని చిరంజీవి, పవన్ సక్సెస్ గురించి మాట్లాడుతూ కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ వరుస సినిమాలలో నటిస్తుండగా ఆ సినిమాల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.

పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయ్యి ఆ సినిమాలను వేగంగా విడుదల చేయాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుని కెరీర్ పరంగా సత్తా చాటాల్సిన అవసరం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వరుస ఇండస్ట్రీ హిట్లను సాదించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.