March 22, 202509:06:32 AM

Rajinikanth, Salman Khan: రజనీ.. సల్మాన్‌ మల్టీస్టారర్‌ నిజమా? ఆ దర్శకుడు ట్రై చేస్తున్నారా?

సినిమాలంటే మావే, మేం చేస్తేనే బ్లాక్‌ బస్టర్లు, ఇండియన్‌ సినిమా అంటే బాలీవుడ్‌ సినిమానే అని ఒకప్పుడు వద్దన్నా విర్రవీగేవారు బాలీవుడ్‌లో కొందరు. ఒకవైపు సౌత్‌ హీరోలతో స్నేహం చేస్తున్నా.. సినిమాల విషయంలో మేమే ముందు అనుకునేవారు. అయితే కరోనా – లాక్‌డౌన్‌ పరిస్థితుల తర్వాత బాలీవుడ్‌ ప్రేక్షకుల ఆలోచన మారింది. దాంతో బాలీవుడ్‌ మారాల్సి వచ్చింది. అందులో ఓ మార్పు మన హీరోలతో, మన దర్శకులతో, మన హీరోయిన్లతో వాళ్లు నటించడం.

ఇటీవల కాలంలో తెలుగులో తెరకెక్కుతున్న భారీ చిత్రాల్లో బాలీవుడ్‌ భామలు హీరోయిన్లు అవుతున్నారు. అయితే ఇదేం కొత్త కాదు. గతంలో చాలామంది చేశారు. అయితే అక్కడి చోటా మోటా హీరోలు, సీనియర్‌ హీరోలు మన దగ్గరకు వచ్చి విలన్లు అవుతున్నారు. మరికొందరు అయితే అతిథి పాత్రలు, ప్రత్యేక పాత్రలు చేస్తున్నారు. అలాగే మనవాళ్లు అక్కడకు వెళ్లి సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ‘గాడ్‌ ఫాదర్‌’లో (God Father) సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) కీలక పాత్ర చేయగా.. ఆ వెంటనే ‘కిసీ కీ భాయ్‌ కీసీ కా జాన్‌’లో (Kisi Ka Bhai Kisi Ki Jaan) వెంకటేశ్‌ (Venkatesh) , రామ్‌చరణ్‌ (Ram Charan) నటించారు. ఈ క్రమంలో మరో కాంబో రెడీ అవుతోంది అంటున్నారు.

సల్మాన్‌ ఖాన్‌ రీసెంట్‌గా అట్లీ సినిమా ఒకటి ఓకే చేశాడు అని వార్తలొచ్చాయి. అయితే ఈ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు కానీ.. అందులో రజనీకాంత్‌ (Rajinikanth) కూడా నటిస్తాడు అని అంటున్నారు. అల్లు అర్జున్ (Allu Arjun) నో చెప్పాక అట్లీ.. ఇప్పుడు సల్మాన్ ఖాన్‌తో సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నారు అని టాక్‌. ఈ క్రమంలో ఆ సినిమాలో రజనీకాంత్‌ కూడా నటిస్తారు అనే వార్తలు వస్తున్నాయి. అయితే పూర్తి స్థాయి పాత్ర కాదు అని అంటున్నారు. ‘పెద రాయుడు’ సినిమా స్టైల్‌లో కీలక సమయంలో వచ్చే పాత్ర అని చెబుతున్నారు.

ప్రస్తుతం ‘వెట్టయాన్’ / ‘వేటగాడు’ (Vettaiyan) సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నారు రజనీకాంత్‌. ఆ సినిమా తర్వాత అన్నీ అనుకున్నట్లుగా జరిగితే సల్మాన్‌ ఖాన్‌ సినిమాలో రజనీ కూడా కనిపిస్తారు. ఇక సల్మాన్‌ సంగతి చూస్తే.. మురగదాస్ (A.R. Murugadoss) దర్శకత్వంలో ‘సికందర్’ అనే సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత ‘దబంగ్‌ 4’ ఉంటుంది అని చెబుతున్నారు. ఒకవేళ ఈ కాంబో ఓకే అయితే బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌.. కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ కలసి ‘సూపర్‌’ కాంబో అవుతుంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.