March 22, 202507:21:21 AM

Kalki 2898 AD: ఆ టికెట్ల విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ జాగ్రత్త పడాల్సిందే!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్  (Prabhas) నటించిన కల్కి (Kalki 2898 AD) రిలీజ్ కావడానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉండగా ఈ సినిమాకు టికెట్లు దొరకడం లేదని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. అయితే కొంతమంది బెనిఫిట్ షో టికెట్లు అంటూ, ఎక్స్ట్రా టికెట్లు అంటూ ప్రభాస్ అభిమానులను మోసం చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మూవీ టికెట్ బుకింగ్ యాప్స్, థియేటర్ల కౌంటర్ల దగ్గర మాత్రమే కల్కి టికెట్స్ కొంటే మోసపోయే ఛాన్స్ ఉండదు.

ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం జరుగుతున్న మోసాలకు సంబంధించి అలర్ట్ గా ఉంటే మంచిది. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని భావించే వాళ్ల బలహీనతను క్యాష్ చేసుకోవాలనే ఆలోచనతో కొంతమంది మోసాలకు పాల్పడుతున్నారు. మరోవైపు సలార్ (Salaar) రికార్డ్ ను ఈ సినిమా బ్రేక్ చేయడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. నార్త్ అమెరికాలో సలార్ టికెట్స్ ఏకంగా 1,25,000 అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది.

సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కగా కల్కి సినిమాకు భారీ టికెట్ రేట్లు ఉండటం ప్లస్ అవుతోంది. కల్కి 2898 ఏడీ సినిమాపై అభిమానులు భారీ స్థాయిలో ఆశలు పెట్టుకోవడం జరిగింది. కల్కి 2898 ఏడీ సినిమాలో ట్విస్టులు సైతం ఆసక్తికరంగా ఉండనున్నాయని సమాచారం అందుతోంది. ఇతర భాషల అగ్ర నటీనటులు నటించడం ఈ సినిమాకు మరింత ప్లస్ అవుతోంది.

కల్కి 2898 ఏడీ 3 గంటల నిడివితో రిలీజ్ కానుండటంతో ఈ సినిమాకు టాక్ కీలకం కానుంది. కల్కి 2898 ఏడీ ఇతర భాషల ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. కల్కి సెకండ్ పార్ట్ గురించి సినిమా రిలీజ్ తర్వాత క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కల్కి సెకండ్ పార్ట్ ఏ రేంజ్ లో ఉండబోతుందో తెలియాల్సి ఉంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.