March 17, 202507:50:47 AM

Ravi Teja, Prashant Varma: రవితేజ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో మూవీ ఫిక్స్.. ప్రకటన అప్పుడేనా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రవితేజ (Ravi Teja) వరుస సినిమాలతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. రవితేజ సినిమాల నాన్ థియేట్రికల్ హక్కులు సైతం భారీ మొత్తానికి అమ్ముడవుతున్నాయి. ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ (Mr. Bachchan) సినిమాతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లతో రవితేజ బిజీగా ఉండగా రవితేజ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయిందని సమాచారం అందుతోంది. అయితే రవితేజ ప్రస్తుతం కొన్ని సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ సినిమా ప్రకటన ఒకింత ఆలస్యం కానుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

అయితే ఈ సినిమా మాత్రం కచ్చితంగా ఉంటుందని తెలుస్తోంది. హనుమాన్ (Hanuman) సినిమాతో ప్రశాంత్ వర్మ మార్కెట్ ఎన్నో రెట్లు పెరిగింది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో నటించడానికి టాలీవుడ్ హీరోలు సైతం ఎంతో ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం. రవితేజ ప్రశాంత్ వర్మ కాంబో మూవీకి నిర్మాతలు ఎవరు? ఇతర ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే మరికొన్ని వారాలు ఆగాల్సిందే. రవితేజ వయస్సు పెరుగుతున్నా గ్యాప్ లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.

మాస్ మహారాజ్ రవితేజ రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రాజెక్ట్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తారో చూడాల్సి ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రవితేజ పాన్ ఇండియా హిట్లు అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నా గత సినిమాలు తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేశాయి. రవితేజ యంగ్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చే విషయంలో ముందువరసలో ఉంటారు. రవితేజ మాస్ సినిమాలలో వరుసగా నటించడం ద్వారా రాబోయే రోజుల్లో మరిన్ని భారీ విజయాలను అందుకోవడం ఖాయమని అభిమానులు మాత్రం ఫీలవుతున్నారు.

రవితేజ పాన్ ఇండియా హిట్ ను సాధిస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. విక్రమార్కుడు (Vikramarkudu) సీక్వెల్ లో ఛాన్స్ వచ్చినా రవితేజ కొన్ని రీజన్స్ వల్ల వదులుకున్నారు. మాస్ మహారాజ్ ఊరమాస్ సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తే అభిమానులు ఎంతో సంతోషిస్తారని చెప్పవచ్చు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.