March 20, 202507:18:53 PM

Satyabhama: ఫస్ట్‌ సినిమా.. హీరోయిన్‌తోనా అని అడిగారు: ‘సత్యభామ’ నిర్మాతలు

తెలుగులో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు చాలా తక్కువ వస్తుంటాయి. అలా వచ్చినవాటిలో ఎక్కువ శాతం పోలీసు సినిమాలే ఉంటాయి. లేదంటే హారర్‌ కామెడీ ఉంటుంది. ఇప్పుడు మొదటి రకం సినిమా ఒకటి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే ‘సత్యభామ’ (Satyabhama) . కాజల్‌ (Kajal Aggarwal) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకొస్తోంది. అయితే ఈ సినిమా హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమా కాదు అంటున్నారు నిర్మాతలు. అదేంటి ఆమె ఒక్కరే కనిపిస్తున్నారుగా ప్రచార చిత్రాల్లో అంటారా? దానికి ఆన్సరే ఈ వార్త.

విజయశాంతి (Vijayashanti) ‘కర్తవ్యం’ కంటే బలమైన కథానాయిక పాత్రతో రూపొందిన సినిమా మా ‘సత్యభామ’ అంటున్నారు నిర్మాతలు బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి. సుమన్‌ చిక్కాల (Suman Chikkala) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ‘మేజర్‌’ సినిమా దర్శకుడు శశికిరణ తిక్క (Sasi Kiran Tikka) సమర్పిస్తున్నారు. ఆయన స్క్రీన్‌ప్లేతోనే ఈ సినిమా తెరకెక్కింది కూడా. ఇరవయ్యేళ్ల క్రితం జరిగిన ఓ సంఘటనను స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమా కథ సిద్ధం చేశారట.

ఇక హీరోయిన్‌ ఎవరు అనే విషయంలో నలుగురు పేర్లు అనుకున్నా తొలి పేరు మాత్రం కాజల్‌దేనట. కథ విన్నాక ఆమె చాలా ఆసక్తిగా చేద్దాం అని ముందుకొచ్చారట. ఈ సినిమాలో పోలీసు యాక్షన్‌తోపాటు సందేశం కూడా ఉందట. షి సేఫ్‌ అనే యాప్‌ గురించి సినిమాలో కీలక విషయాలు చర్చిస్తారట. అవి నిజ జీవితంలో మహిళలకు చాలా ఉపయోగపడతాయి అని టీమ్‌ చెబుతోంది. ‘మేజర్‌’ (Major) సినిమా తర్వాత నిర్మాతలు సొంత నిర్మాణ సంస్థని ఏర్పాటు చేయాలని అనుకున్నారట.

అయితే శశికిరణ్‌ చేతిలో వేరే సినిమాలు ఉండటంతో నిర్మాతలే ‘సత్యభామ’ కథ విని చేయాలని ఫిక్స్‌ అయ్యారట. నిర్మాతలు అవుతున్నారు అనే విషయం తెలియగానే.. కొంతమంది ఏంటీ.. తొలి సినిమాని హీరోతో కాకుండా, హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చేస్తున్నారా? అని అడిగారట. అయితే ఇది హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమా అనడం కంటే, హీరోయిజం ఓరియెంటెడ్‌ సినిమా అనడం కరెక్ట్‌ అని నిర్మాతలు చెప్పేవారట. అలా ఇది హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కాదు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.