March 18, 202503:04:00 PM

Vijay, Pawan Kalyan: వైరల్ అవుతున్న విజయ్ సంచలన ట్వీట్.. అలా కామెంట్స్ చేస్తూ?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay Thalapathy) ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. విజయ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి. విజయ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేసిన రాజకీయాలతో బిజీ కానున్నారని సమాచారం అందుతోంది. అయితే ఏపీలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సంచలన ఫలితాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. జనసేన 21 స్థానాల్లో పోటీ చేయగా 21 స్థానాల్లో అనుకూల ఫలితాలను సొంతం చేసుకుంది.

100 శాతం స్ట్రైక్ రేట్ తో జనసేన సత్తా చాటగా పవన్ కళ్యాణ్ గెలుపు గురించి విజయ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు అని విజయ్ అన్నారు. ఏపీ అసెంబ్లీలో జనసేన రెండో అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించినందుకు సంతోషంగా ఉందని విజయ్ పేర్కొన్నారు. ప్రజల కొరకు పవన్ కట్టుబడిన తీరు పవన్ పట్టుదల అందరికీ స్పూర్తిదాయం అని విజయ్ చెప్పుకొచ్చారు.

భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ మరిన్ని విజయాలు సాధించాలని ఆయన పేర్కొన్నారు. విజయ్ చేసిన కామెంట్స్ అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి. భవిష్యత్తులో విజయ్ కూడా రాజకీయాల్లో సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు ఫీలవుతున్నారు. జనసేన విజయంతో పవన్ కళ్యాణ్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

పవన్ కళ్యాణ్ అంటే విజయ్ కు ఎంతో అభిమానం ఉంది. విజయ్ ప్రస్తుతం సౌత్ లో 150 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారని సమాచారం అందుతోంది. పవన్ కళ్యాణ్ సైతం విజయ్ పోస్ట్ గురించి స్పందిస్తారేమో చూడాల్సి ఉంది. విజయ్ ఇతర భాషల్లో సైతం కెరీర్ పరంగా మరింత సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. పవన్ ఇప్పటికే ప్రకటించిన సినిమాలను త్వరలో పూర్తి చేయనున్నారని తెలుస్తోంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.