March 25, 202511:05:37 AM

Varun Sandesh: వరుణ్ సందేశ్ నటించిన ఆ మూవీ ఫ్లాప్ కావడానికి కారణాలివే!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఒకానొక సమయంలో వరుస ఫ్లాపుల వల్ల కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కోగా టెంపర్ (Temper) సినిమాతో హిట్ సాధించారు. ఒక రకంగా ఈ సినిమా తారక్ కమ్ బ్యాక్ మూవీ అని ఫ్యాన్స్ భావిస్తారు. అయితే ఈ సినిమాకు పోటీగా రిలీజ్ చేయడం వల్ల తాను నటించిన పడ్డానండి ప్రేమలో మరీ సినిమా ఫ్లాపైందని వరుణ్ సందేశ్ (Varun Sandesh) వెల్లడించగా ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నింద సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చిన వరుణ్ సందేశ్ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. నేను పంపిన అడిషన్ నచ్చి శేఖర్ కమ్ముల (Sekhar Kammula) హ్యాపీడేస్ (Happy Days) సినిమాకు ఛాన్స్ ఇచ్చారని వరుణ్ సందేశ్ పేర్కొన్నారు. నన్ను ఆ సినిమాలో ఎందుకు తీసుకున్నారో శేఖర్ సార్ చెప్పాలని ఆయన తెలిపారు. కొత్త బంగారు లోకం కథ విన్న సమయంలోనే ఎంతో నచ్చిందని ఆయన తెలిపారు.


కొత్త బంగారు లోకం సినిమా క్లైమాక్స్ జయసుధ (Jayasudha) ఏడుస్తుంటే నా కళ్ల వెంట నీళ్లు వచ్చాయని వరుణ్ సందేశ్ పేర్కొన్నారు. మరో చరిత్ర సినిమాకు భారీగా ఓపెనింగ్స్ వచ్చాయని ఆయన తెలిపారు. ఆ సినిమా టైటిల్ విషయంలో తప్పు జరిగిందని వరుణ్ అన్నారు. మరో చరిత్ర మూవీ సాంగ్స్ కూడా హిట్టయ్యాయని ఆయన తెలిపారు. ఏమైంది ఈ వేళ సినిమాతో మరో సక్సెస్ దక్కిందని వరుణ్ పేర్కొన్నారు.

పాండవులు పాండవులు తుమ్మెద (Pandavulu Pandavulu Tummeda) షూట్ ఎంజాయ్ చేశానని వరుణ్ సందేశ్ అన్నారు. పడ్డానండి ప్రేమలో మరి షూట్ సమయంలో వితికను (Vithika Sheru) కలిశానని ఆయన తెలిపారు. టెంపర్ కు పోటీగా రిలీజ్ వద్దని చెప్పినా పడ్డానండి ప్రేమలో మరీ రిలీజ్ చేశారని వరుణ్ సందేశ్ చెప్పుకొచ్చారు. వరుణ్ సందేశ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుందని నింద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.