
నయనతార (Nayanthara) విఘ్నేష్ శివన్ (Vignesh Shivan) పెళ్లి చేసుకుని రెండు సంవత్సరాలు అయిన సంగతి తెలిసిందే. రెండో వివాహ వార్షికోత్సవం సందర్భంగా విఘ్నేష్ శివన్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. నిన్ను పెళ్లి చేసుకోవడం నా లైఫ్ లో అతి గొప్ప విషయం అంటూ నయన్ గురించి విఘ్నేష్ శివన్ కామెంట్లు చేశారు. పదేళ్ల నయనతార.. రెండేళ్ల విక్కీ నయన్.. ఈరోజు మా రెండో వివాహ వార్షికోత్సవం..
నిన్ను పెళ్లి చేసుకోవడం నా లైఫ్ లోకి ఉయిర్ ఉలగం రావడం అతి గొప్ప విషయమని విఘ్నేష్ శివన్ పేర్కొన్నారు. నా భర్య తంగమేయిని చాలా ప్రేమిస్తున్నానని నయన్ తో ఉన్న ఆహ్లాదకరమైన సమయాలు, జ్ఞాపకాలు, విజయవంతమైన క్షణాలను ఎప్పటికీ మరిచిపోలేనని ఆయన చెప్పుకొచ్చారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నయన్ కు తోడుగా ఉంటానని ఆ దేవుడు ఎల్లవేళలా మనకు అండగా నిలవాలని కోరుకుంటున్నానని విఘ్నేష్ శివన్ వెల్లడించారు.
మన ఉయిర్ ఉలగంతో సంతోషంగా ఉండాలనేదే ఆశయమని ఆయన పేర్కొన్నారు. అలాగే మన పెద్దపెద్ద ఆశయాలు నెరవేరాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని విఘ్నేష్ శివన్ చెప్పుకొచ్చారు. విఘ్నేష్ శివన్ చేసిన ఈ పోస్ట్ కు 7 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. విమర్శలకు తావివ్వని సినిమాల్లో మాత్రమే నయనతార నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే నయనతార కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది. నయన్ రెమ్యునరేషన్ విషయంలో మాత్రం టాప్ లో ఉన్నారు.
నయనతార రేంజ్, క్రేజ్, పాపులారిటీ వేరే లెవెల్ లో ఉండగా తెలుగులో మాత్రం ఆమెకు ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు అయితే రావడం లేదని సమాచారం అందుతోంది. నయనతార 4 పదుల వయస్సులో కూడా ఊహించని రేంజ్ లో ఆఫర్లు సొంతం చేసుకుంటూ ప్రశంసలు అందుకుంటున్నారు. నయనతార స్థాయిలో సుదీర్ఘ కాలం కెరీర్ ను కొనసాగించిన హీరోయిన్లు చాలా తక్కువమంది ఉన్నారు.
View this post on Instagram