March 28, 202502:12:08 PM

Akash Puri: ఇప్పటి నుండీ అయినా పూరి కొడుక్కి కలిసొస్తుందా.!

పూరి జగన్నాథ్  (Puri Jagannadh) కొడుకు ఆకాష్ పూరి (Akash Puri) అందరికీ సుపరిచితమే. చైల్డ్ ఆర్టిస్ట్ గా ‘చిరుత’ (Chirutha) సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అతను ఆ తర్వాత ‘బుజ్జిగాడు’ ‘బిజినెస్ మెన్’ (Businessman) ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) వంటి సినిమాల్లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. అయితే ‘ఆంధ్రాపోరి’ (Andhra Pori) అనే సినిమాతో ఇతను హీరోగా మారాడు. ఆ తర్వాత ‘మెహబూబా’ (Mehbooba) ‘రొమాంటిక్’ (Romantic) ‘చోర్ బజార్’ (Chor Bazaar) వంటి సినిమాల్లో నటించాడు. కానీ ఇప్పటివరకు ఒక్క సక్సెస్ కూడా అందుకోలేదు. ఇప్పుడు కూడా పలు సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు.

ఎప్పటికి బ్రేక్ వస్తుందో కచ్చితంగా చెప్పలేము. కానీ తన వరకు అన్ని రకాలుగా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాడు. ఎక్కడా తగ్గడం లేదు. మరోపక్క వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెట్టాడు. ఓ క్లోతింగ్ కంపెనీకి ఇతను అంబాసిడర్ గా పనిచేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఆకాష్ పూరి కొందరి హీరోల మాదిరి పేరు మార్చుకుని వార్తల్లో నిలుస్తున్నాడు. అవును తన తండ్రి పేరులోని మొదటి… రెండు అక్షరాలు అయిన పూరిని తీసుకుని తన పేరు చివర పెట్టుకున్నాడు.

అలా ఆకాష్ పూరిగా పిలవబడుతూ వచ్చాడు. కానీ ఇప్పుడు ఆకాష్ జగన్నాథ్ గా మార్చుకున్నాడు. అవును జూలై 25 న ఆకాష్ పుట్టినరోజు నాడు తన పేరు ఆకాష్ జగన్నాథ్ గా మార్చుకున్నాడు. మరి పేరు మార్చుకున్నాక అయినా.. అక్షర బలం కలిసొచ్చి అతను హిట్లు సాధిస్తాడేమో చూడాలి..! త్వరలో అతని సోషల్ మీడియా ఖాతాలు అన్నిటిలో కూడా ఆకాష్ పక్కనున్న పూరి తీసేసి జగన్నాథ్ వచ్చి చేరనుంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.