March 28, 202502:50:42 PM

Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ స్ట్రాంగ్ డెసిషన్

సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) రెండేళ్ల క్రితం ఓ పెద్ద యాక్సిడెంట్ కి గురయ్యాడు. కోలుకోవడానికి ఏడాది వరకు పట్టింది. యాక్సిడెంట్ నుండీ కోలుకున్నాక ‘విరూపాక్ష’  (Virupaksha)  ‘బ్రో’ (BRO) వంటి సినిమాల్లో నటించాడు. అందులో ‘విరూపాక్ష’ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. పవన్ కళ్యాణ్ తో కలిసి చేసిన ‘బ్రో’ మంచి ఓపెనింగ్స్ ని తీసుకుంది కానీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ మూవీగా నిలవలేదు. ఇదిలా ఉంచితే.. సాయి ధరమ్ తేజ్ మంచి డాన్సర్.

కానీ యాక్సిడెంట్ అవ్వడం వల్ల.. సరైన ఎక్సర్సైజ్..లు వంటివి చేయలేకపోవడం వల్ల.. ఒళ్ళు చేశాడు. ‘విరూపాక్ష’ లో డాన్స్ నంబర్స్ లేవు. కానీ ‘బ్రో’ సినిమాలో ఒకటి రెండు పాటలకి అతను డాన్స్ చేయడానికి ఇబ్బందిపడ్డాడు. అందువల్ల చాలా ట్రోల్స్ ఫేస్ చేశాడు. ఆ ట్రోలింగ్ వల్ల అతను కొంచెం అప్సెట్ అయినట్టు టీం చెబుతుంది. అందుకోసం ప్రస్తుతానికి అతను ఏ సినిమాకి కమిట్ అవ్వలేదు. ‘హనుమాన్’ నిరంజన్ రెడ్డి నిర్మాణంలో ఓ సినిమా చేయాలి.

‘ఎస్.వి.సి.సి’ బాపినీడు నిర్మాణంలో కూడా ఓ సినిమా చేస్తానని మాటిచ్చాడు. అయితే వెంటనే చేసే అవకాశాలు లేవట. ఓ ట్రైనర్ ని పెట్టుకుని.. 6 ప్యాక్ వంటివి చేసి ఆ తర్వాత ఆ సినిమాలో నటించాలని అతను భావిస్తున్నాడట. గతంలో ‘సుప్రీమ్’ సినిమా నుండి ‘ప్రతిరోజూ పండగే’ వరకు సాయి ధరమ్ తేజ్ సిక్స్ ప్యాక్ మెయింటైన్ చేసేవాడు. ఇప్పుడు మళ్ళీ ఒకప్పటిలా మారాలని ప్రయత్నిస్తున్నాడు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.