March 27, 202501:32:27 PM

Alia Bhatt: అంబానీ పెళ్లిలో ఆలియా చీర గురించి అందరి చర్చ.. ఎందుకంటే?

అనంత్‌ అంబానీ – రాధి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రిసెప్షన్‌ కూడా అంతే ఘనంగా జరిగింది. దీనికి అతిథులుగా వచ్చిన అలియా భట్‌ (Alia Bhatt) ధరించిన చీర ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చూడటానికి సింపుల్‌గా ఉన్నా.. ఆ చీర ప్రత్యేకతలు తెలిస్తే వావ్‌ అంటున్నారు. అంబానీ పెళ్లిలో ముకేశ్‌ ఇచ్చిన రిటర్న్‌ గిఫ్ట్‌ల గురించి ఎంతగా మాట్లాడారో? ఈ చీర గురించి కూడా మాట్లాడారు అంటున్నారు. ఎందుకంటే ఈ చీర చరిత్ర 160 ఏళ్లు అంటున్నారు.

అలియా కట్టుకున్న చీర సింపుల్‌గా ఉంటుంది. పింక్‌ కలర్‌ జెరీ బార్డర్‌ పట్టు చీర అది. ఈ చీరను స్వచ్ఛమైన బంగారం, వెండితో తయారు చేశారట. 160 ఏళ్ల క్రితం గుజరాత్‌లో నేసిన ఆశావళి పట్టుచీర ఇది. దీని తయారిలో 99 శాతం వెండి జరీ బార్డర్‌ వినియోగించారట. రీగల్ లుక్ అందించడానికి ఆరు గ్రాముల బంగారాన్ని ఉపయోగించినట్టు సమాచారం. 16వ శతాబ్దం నుండి ఖాత్రీలు, పటేళ్లు ఈ తరహా చీరలను నేస్తున్నారట.

దీంతో ఈ చీర ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఆ చీరకు పర్‌ఫెక్ట్‌గా సరిపోయేలా స్ట్రాపలెస్‌ బ్లౌజ్‌ను ధరించి ఆలియా. దానికి తగ్గ డైమండ్‌ సెట్‌, రెస్‌ప్లెండెంట్‌ నెక్లేస్‌, ఇయర్‌ రింగ్స్‌, బొట్టు బిళ్ల ధరించింది వావ్‌ అనిపించింది. గుజరాత్‌ ప్రాచీన నేత కళను అందరి దృష్టిలో పెట్టేలా ఆలియా ఆ చీర కట్టుకుని వచ్చిందని చెబుతున్నారు. నాటి కళ గొప్పతనం ఇలా అయినా నేటి తరానికి తెలుస్తుందని అంటున్నారు.

ఆలియా సినిమాల సంగతి చూస్తే.. యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ సంస్థ బ్యానర్‌లో ఆమె ఓ సినిమా చేస్తోంది. యశ్‌ స్పై యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో మరో నాయికగా భూమి పెడ్నేకర్‌ (Bhumi Pednekar) నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ ముంబయిలో మొదలైంది. ఈ సినిమా పాన్‌ ఇండియా లెవల్‌లో రిలీజ్‌ చేస్తున్నారు. స్పై యూనివర్స్‌లో తొలి మహిళ ప్రధాన పాత్రధారులు వీళ్లే.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.