March 24, 202512:27:04 PM

Rakul’s Brother Aman Arrested: స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బ్రదర్ అరెస్ట్.. అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్నేళ్ల క్రితం వరకు ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఒకరు. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), అల్లు అర్జున్ (Allu Arjun) , రామ్ చరణ్ (Ram Charan) లకు జోడీగా నటించి పాపులర్ అయిన రకుల్ ఈ మధ్య కాలంలో పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు. అయితే మాదక ద్రవ్యాల కేసులో రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అరెస్ట్ కావడం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా సంచలనం కావడం గమనార్హం. రకుల్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ మాదక ద్రవ్యాలను సేవిస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినట్టు సమాచారం అందుతోంది.

వైరల్ అవుతున్న వార్తలు విని షాకవ్వడం ఫ్యాన్స్ వంతవుతోంది. రాజేంద్ర నగర్ డివిజన్ లో మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న ఐదుగురు నైజీరియన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని భోగట్టా. వాళ్ల నుంచి అమన్ కూడా డ్రగ్స్ కొనుగోలు చేస్తూ పోలీసులకు చిక్కాడని సమాచారం. అమన్ ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు ధృవీకరించాల్సి ఉంది. ఈ జాబితాలో మరికొందరు వీఐపీలు కూడా ఉన్నారని తెలుస్తోంది.

గతంలో మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసులో రకుల్ ఆరోపణలు ఎదుర్కోగా ఇప్పుడు రకుల్ సోదరుడి పేరు వెలుగులోకి రావడం కొసమెరుపు. పోలీసుల దర్యాప్తులో ఈ కేసుకు సంబంధించి మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. వైరల్ అవుతున్న వార్తల గురించి రకుల్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. రకుల్ రెమ్యునరేషన్ ప్రస్తుతం పరిమితంగానే ఉందనే సంగతి తెలిసిందే.

రకుల్ కెరీర్ పుంజుకుంటుందనే తరుణంలో ఊహించని వివాదాలు ఆమెకు కొత్త ఇబ్బందులను క్రియేట్ చేస్తున్నాయనే చెప్పాలి. రకుల్ సోదరుడు ఈ కేసు నుంచి నిర్దోషిగా బయటపడాలని ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ వివాదాలకు ఛాన్స్ ఇవ్వకుండా కెరీర్ పరంగా మరింత జాగ్రత్తగా ఉండాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.