March 25, 202501:12:54 PM

Bellamkonda Sreenivas: అంధులకు భోజనం, బట్టలు అందించిన టాలీవుడ్ హీరో.. ఏమైందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో బెల్లంకొండ శ్రీనివాస్ కు (Bellamkonda Sai Sreenivas) నటుడిగా మంచి పేరు ఉంది. బెల్లంకొండ సురేశ్ (Bellamkonda Suresh) కొడుకుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ నటుడిగా తనకంటూ మంచి పేరును సంపాదించుకున్నారు. అల్లుడు శ్రీను (Alludu Seenu) విడుదలై 10 సంవత్సరాలు కావడంతో ఈ హీరో అంధుల పాఠశాలకు వెళ్లి అక్కడ చదువుతున్న విద్యార్థులకు భోజనం, బట్టలు అందించి వార్తల్లో నిలవడం గమనార్హం. ప్రస్తుతం టైసన్ నాయుడు (Tyson Naidu) , రాక్షసుడు2 (Rakshasudu) సినిమాలలో నటిస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్, నాంది డైరెక్టర్ డైరెక్షన్ లో సైతం ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.

సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లు పూర్తైన సందర్భంగా నాకు అండగా నిలిచిన ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులకు కృతజ్ఞతతో ఉన్నానని బెల్లంకొండ శ్రీనివాస్ వెల్లడించారు. ప్రేక్షకుల తిరుగులేని సపోర్ట్ నాకు బలం అని ఆయన పేర్కొన్నారు. ఈ స్పెషల్ డేను నాకు అత్యంత ముఖ్యమైన వాళ్లతో జరుపుకుంటున్నానని బెల్లంకొండ శ్రీనివాస్ వెల్లడించారు. మీ ప్రేమ మరియు మద్దతుతో మమ్మల్ని ఆశీర్వదించడం కొనసాగించాలని బెల్లంకొండ శ్రీనివాస్ కామెంట్లు చేశారు.

బెల్లంకొండ శ్రీనివాస్ వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్ట్స్ ఫలితాలు ఏ విధంగా ఉండనున్నాయనే చర్చ సైతం జోరుగా జరుగుతుండటం గమనార్హం. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు హిందీ యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తుండటం ఈ హీరోకు ఒక విధంగా ప్లస్ అవుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా కెరీర్ ను కొనసాగిస్తూ బెల్లంకొండ శ్రీనివాస్ ప్రశంసలు అందుకుంటున్నారు.

బెల్లంకొండ శ్రీనివాస్ రేంజ్, రెమ్యునరేషన్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. బెల్లంకొండ శ్రీనివాస్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య సైతం ఊహించని స్థాయిలో పెరుగుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే కెరీర్ పుంజుకుంటుందని చెప్పవచ్చు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.