March 26, 202502:10:37 AM

Sai Dharam Tej, Pavala Syamala: సాయితేజ్ సాయం చేయడంతో పావలా శ్యామల ఎమోషనల్.. ఏమైందంటే?

టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన సాయితేజ్ (Sai Dharam Tej) ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే స్పందించే విషయంలో ముందువరసలో ఉంటారు. ప్రస్తుతం హనుమాన్ (Hanu Man)  మేకర్స్ నిర్మాణంలో ఒక సినిమాలో నటిస్తున్న సాయితేజ్ ఈ సినిమాతో విరూపాక్షను (Virupaksha) మించిన హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 120 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది. ప్రముఖ టాలీవుడ్ నటి పావలా శ్యామలకు (Pavala Syamala) సహాయం చేయడం ద్వారా సాయితేజ్ మంచి మనస్సును చాటుకున్నారు.

సీనియర్ నటి పావలా శ్యామల గత కొన్ని నెలల నుంచి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆమె ఆర్థిక స్థితికి సంబంధించిన కొన్ని వీడియోలు సైతం నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. సాయితేజ్ పావలా శ్యామలకు లక్ష రూపాయల సహాయం చేయడం గమనార్హం. సాయితేజ్ చేసిన సహాయం గురించి ఆమె స్పందిస్తూ మా అమ్మాయికి ఆపరేషన్ అయిన సమయంలో సాయితేజ్ నాకు కాల్ చేశాడని ఆ సమయంలో ధైర్యం చెప్పాడని సాయితేజ్ కలుస్తానని చెప్పారని అయితే చాలా రోజులు కావడంతో మరిచిపోయారేమో అనుకున్నానని పావలా శ్యామల తెలిపారు.

గుర్తు పెట్టుకుని సాయం చేసినందుకు సాయితేజ్ కు ధన్యవాదాలు అని ఆమె వెల్లడించారు. సాయితేజ్ తో వీడియో కాల్ మాట్లాడిన పావలా శ్యామల ఎమోషనల్ అవుతూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చనిపోదామని అనుకున్నానని సమయానికి మీరు సాయం చేసి నాకు, నా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టారని ఆమె చెప్పుకొచ్చారు. మీరు కన్నీళ్లు పెట్టుకుంటే కష్టంగా ఉందని ఏడవద్దని సాయితేజ్ సూచించారు.

సాయితేజ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సాయితేజ్ ను స్పూర్తిగా తీసుకుని కష్టాల్లో ఉన్న సెలబ్రిటీలకు ఇండస్ట్రీ ఎప్పుడూ అండగా నిలబడితే మంచిదని చెప్పవచ్చు. సాయితేజ్ విభిన్నమైన కథలను ఎంచుకోవడం ఆయనకు కెరీర్ పరంగా ప్లస్ అవుతోంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.