March 21, 202502:01:19 AM

Dheeraj Mogilineni: అల్లు అర్జున్ – సుకుమార్..ల ఇష్యూపై నిర్మాత రియాక్షన్.!

స్టార్ హీరోల పర్సనల్ వ్యవహారాలు కానీ, సినిమాలకి సంబంధించిన లొసుగులు కానీ అంత ఈజీగా బయటకి రావు. ‘రానివ్వరు కూడా’ అనే టాక్ ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంది. సరే ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ఇప్పుడు ‘పుష్ప 2’ గురించి పెద్ద చర్చ నడుస్తోంది. ‘కొద్దిరోజుల నుండి ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule)  షూటింగ్ జరగడం లేదు. షూటింగ్ విషయంలో సుకుమార్ (Sukumar) ప్లానింగ్ ఏమాత్రం బాలేదు. సడన్ గా గ్యాప్ ఇచ్చి అతను అమెరికాకి ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్ళిపోయాడు.

దీంతో కోపం వచ్చి అల్లు అర్జున్ (Allu Arjun).. ‘పుష్ప’ క్యారెక్టర్ కోసం పెంచిన గడ్డం తీసేశాడు. నిర్మాతలు ప్రకటించినట్టు డిసెంబర్ 6న కూడా ఈ సినిమా రిలీజ్ అవ్వడం కష్టమే’.. అనేది ఆ వార్తల సారాంశం. సోషల్ మీడియాలో ఈ టాపిక్ పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుంది. మరోపక్క ఎల్లుండి అంటే జులై 19న రిలీజ్ కాబోతున్న చిన్న సినిమా ‘పేక మేడలు’ ప్రమోషన్స్ లో నిర్మాత ధీరజ్ మొగిలినేని (Dheeraj Mogilneni) కూడా పాల్గొన్నారు. ఈ సినిమాని అతను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.

అందుకే ఈరోజు ఏర్పాటు చేసిన ‘క్యూ అండ్ ఎ’ లో ఆయన రిపోర్టర్లతో ముచ్చటించారు. ఈ క్రమంలో ఆయనికి ‘పుష్ప 2’ ఇష్యు గురించి ఓ ప్రశ్న ఎదురైంది. ” ‘గీతా ఆర్ట్స్’ లో మీరు కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు, కాబట్టి ‘పుష్ప 2’ షూటింగ్ విషయంలో ఏం జరుగుతుంది? అల్లు అర్జున్ ఎందుకు గడ్డం తీసేశారు?” అంటూ ధీరజ్ మొగిలినేని ప్రశ్నించాడు ఓ రిపోర్టర్. దానికి ధీరజ్ మొగిలినేని చాలా ఇబ్బంది పడ్డారు. ‘ఇది సందర్భం కాదు.

మీ ప్రశ్న నేను వినలేదు.. నాకు సంబంధం లేదు’ అంటూ సైడ్ అయిపోయాడు ధీరజ్. ఇక ధీరజ్ మొగిలినేని విషయానికి వస్తే.. ఆయన ‘గీతా ఆర్ట్స్’ తో కలిసి ‘ఊర్వశివో రాక్షసివో’ (Urvasivo Rakshasivo) ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ (Ambajipeta Marriage Band) వంటి సినిమాలు నిర్మించారు. మరోపక్క ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) వంటి పెద్ద సినిమాలకి కూడా డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.