March 23, 202508:00:23 AM

Akshay Kumar: అగ్ర స్టార్‌ హీరో సినిమాకి ఇంత కష్టం రాకూడదు.. ఆఖరికి గిఫ్ట్‌లు ఇచ్చినా..!

సినిమా చూడటానికి వచ్చినవాళ్లకు మంచి సినిమా చూపిస్తే చాలు ఖుష్‌ అయిపోతారు. కాస్త ఫీల్‌ తేడా కొట్టినా సినిమాకు ఒకప్పుడు యావరేజ్‌ అని, బిలో యావరేజ్‌ అని టాక్‌ ఇచ్చేవారు. ఇప్పుడు అయితే డైరెక్ట్‌గా హిట్‌ లేదంటే ఫ్లాప్‌ ఉన్నాయి అనుకోండి. ఆ రెంటిలో మొన్నీమధ్య వరకు హిట్‌ తప్ప ఫ్లాప్‌ తెలియని హీరోకు ఇప్పుడు పగోడికి కూడా రాకూడని కష్టాలు వస్తున్నాయి. ఆయనే బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar) . తాజాగా ఆయన కష్టాలను తీర్చడానికి చేసిన ఓ ‘ఫ్రీ’ ప్రయత్నం కూడా ఫలించలేదు.

కష్టమేంటో తర్వాత చూద్దాం.. ముందు అక్షయ్‌ గురించి చూద్దాం. లాక్‌డౌన్‌ – కరోనా పరిస్థితులకు ముందు – తర్వాత అనేలా అక్షయ్‌ పరిస్థితి గురించి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందు వరకు ఆయన ఏడాది ఏడెనిమిది సినిమాలు చేసేవాడు. అందులో దాదాపు అన్నీ విజయం సాధించేవి. కానీ ఇప్పుడు అన్నీ తేడా కొడుతున్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే.. ఆయన చేసిన సినిమాలు చాలా వరకు ఇతర పరిశ్రమల్లో విజయం సాధించినవే.

ఉదాహరణకు ‘సర్ఫిరా’నే తీసుకోండి. తమిళంలో ‘సూరరై పొట్రు’, తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’గా వచ్చిన ఈ సినిమాకు దక్షిణాది సినీ పరిశ్రమలో మంచి ఆదరణ దక్కింది. అయితే ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదలైంది. ఓటీటీల్లో ఈ సినిమాకు బ్రహ్మరథమే పట్టారు. కానీ బాలీవుడ్‌ జనాలకు ఇప్పుడు ఈ సినిమా నచ్చలేదు. దీంతో ఓ మల్టీప్లెక్స్‌లో ఏకంగా సినిమా చూసినవారికి ఒక టీ, రెండు సమోసాలు ఫ్రీగా ఇస్తామని ఆఫర్‌ పెట్టారు.

దీంతో అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరో సినిమాకు ఇలాంటి పరిస్థితా అని ముక్కున వేలేసుకుంటున్నారు నెటిజన్లు. అక్షయ్‌ పరిస్థితి ఎందుకిలా తయారైంది అని కామెంట్లు కూడా చేస్తున్నారు. పోనీ మంచి కథ కాదా? అని అనుకుంటే.. నేషనల్‌ అవార్డు వచ్చిన కథ ఇది. మరి ఎందుకు అక్కడి జనాలకు నచ్చలేదు. ఓటీటీలో ఇప్పటికే చూసేయడం ఓ కారణమా? లేక అక్షయ్‌ అంటేనే నచ్చడం లేదా అనేది తెలియాలి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.