March 23, 202510:15:57 AM

Double Ismart Vs Thangalaan: డబుల్ ఇస్మార్ట్ వర్సెస్ తంగలాన్.. ఏ సినిమాకు ఆడియన్స్ ఓటేస్తారో?

ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదల కావాల్సిన పుష్ప ది రూల్  (Pushpa 2: The Rule)  షూటింగ్ ఆలస్యం కావడం వల్ల డిసెంబర్ కు వాయిదా పడింది. ఆగష్టు 15వ తేదీన పుష్ప2 రావడం లేదని అధికారికంగా ప్రకటించడానికి ముందే డబుల్ ఇస్మార్ట్ ఆ తేదీకి రిలీజ్ కానున్నట్టు ప్రకటన వెలువడింది. పీపుల్స్ మీడియా బ్యానర్ నుంచి కూడా ఒక సినిమా అదే తేదీన విడుదల కానుందని సమాచారం అందుతోంది. అయితే ఇండిపెండెన్స్ డే రేసులో తాజాగా తంగలాన్ (Thangalaan)  కూడా చేరడం గమనార్హం.

విక్రమ్ (Vikram) నటించిన ఈ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలను పెంచేశాయి. బంగారం కోసం అన్వేషణ జరిగే కథాంశంతో, అదిరిపోయే యాక్షన్ సీన్స్ తో ఈ సినిమా తెరకెక్కింది. 19వ శతాబ్దంలో జరిగిన ఘటనలను సైతం ఈ సినిమాలో చూపించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. తంగలాన్ ఆగష్టు నెల 15వ తేదీన విడుదల కానుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారమే ఎట్టకేలకు నిజమైంది.

ఈ సినిమాలో విక్రమ్ ప్రయోగాత్మక లుక్ లో కనిపించనున్నారు. బ్రిటీష్ వాళ్ల నుంచి కేజీఎఫ్ గోల్డ్ మైన్స్ ను తంగలాన్ అనే తెగ ఎలా కాపాడుకుందనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. రామ్  (Ram)  , విక్రమ్ సినిమాలు పోటీ పడితే ఏ సినిమా పై చేయి సాధిస్తుందో చూడాలి. రెండు సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ కానుండటంతో ఒక సినిమా ఎఫెక్ట్ మరో సినిమాపై పడే అవకాశం అయితే ఉంది.

డబుల్ ఇస్మార్ట్ (Double Ismart), తంగలాన్ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కాయి. ఈ రెండు సినిమాలకు ఊహించని స్థాయిలో ప్రమోషన్స్ జరుగుతుండటం కొసమెరుపు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేయాలని సినీ అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.