March 17, 202507:59:32 AM

iSmart Shankar Collections: ‘ఇస్మార్ట్ శంకర్’ కి 5 ఏళ్ళు… ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

ఎన్టీఆర్ తో ‘టెంపర్’ (Temper) వంటి హిట్ సినిమా తీశాక అరడజను ప్లాపులు ఇచ్చాడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh). మధ్యలో అతను డైరెక్ట్ చేసిన ‘రోగ్’ (Rogue) ‘మెహబూబా’ (Mehbooba) వంటి సినిమాలు ఎప్పుడు వచ్చాయో, ఎప్పుడు వెళ్లిపోయాయో కూడా చాలా మందికి తెలీదు అంటే పూరి జగన్నాథ్ పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అలాంటి టైంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ (Ram) తో అతను ‘ఇస్మార్ట్ శంకర్’ (iSmart Shankar) అనే సినిమా చేశాడు. జూలై 18న తక్కువ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.

Dimaak Kharaab from iSmart Shankar crossed 100 Million views1

బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ని సాధించి బయ్యర్స్ కి డబుల్ ప్రాఫిట్స్ అందించింది. నేటితో ‘ఇస్మార్ట్ శంకర్’ రిలీజ్ అయ్యి 5 ఏళ్ళు పూర్తి కావస్తున్న సందర్భంగా… ఆ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ని ఓ లుక్కేయండి :

నైజాం 13.86 cr
సీడెడ్ 5.70 cr
ఉత్తరాంధ్ర 4.05 cr
ఈస్ట్ 2.30 cr
వెస్ట్  1.75 cr
గుంటూరు 1.95 cr
కృష్ణా 2.00 cr
నెల్లూరు 1.05 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 32.65 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.90 Cr
  ఓవర్సీస్ 1.00 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 35.55 cr

‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం 17 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్లో ఏకంగా 35.55 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే బయ్యర్స్ కి రూ.18.55 కోట్లు ప్రాఫిట్స్ అనమాట. ఇక ఇదే సినిమాకి సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ (Double ISmart) రాబోతోంది. ఆగస్టు 15న రిలీజ్ కాబోతున్న ఆ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.