March 23, 202508:00:16 AM

Jai Chiranjeeva: ‘జై చిరంజీవ’ అందుకే ఆడలేదు: డైరెక్టర్ విజయ్ భాస్కర్

త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram)  – కె.విజయ్ భాస్కర్ (K. Vijaya Bhaskar) ..లది హిట్ కాంబినేషన్. త్రివిక్రమ్ రైటింగ్, విజయ్ భాస్కర్..ల డైరెక్షన్లో ‘స్వయంవరం’ ‘నువ్వు నాకు నచ్చావ్’ (Nuvvu Naaku Nachav) ‘మన్మధుడు’ ‘మల్లీశ్వరి’ (Malliswari) వంటి హిట్ సినిమాలు వచ్చాయి. కానీ వీరి కాంబినేషన్లో రూపొందిన ‘జై చిరంజీవ’ భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి ప్లాప్ అయ్యింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ అవ్వకపోడానికి గల కారణాలు దర్శకుడు విజయ్ భాస్కర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరించారు.

విజయ భాస్కర్ మాట్లాడుతూ.. “ఒక్కోసారి కొన్ని అనుకున్నట్టు జరగవు. ‘జై చిరంజీవ’ (Jai Chiranjeeva) సినిమా విషయంలో చిరంజీవి (Chiranjeevi) ప గారు తన బెస్ట్ ఇచ్చారు. కానీ ఆయన ఇమేజ్ ని, నాకు ఆ టైంలో ఉన్న ఇమేజ్ ని బ్లెండ్ చేయాలని ప్రయత్నించాను. అది వర్కౌట్ కాలేదు. ఆ టైంకి అది కొత్త అటెంప్ట్. కానీ రియాలిటీ మిస్ అయ్యిందని జనాలు ఫీలయ్యారు. ‘నువ్వు నాకు నచ్చావ్’ చూస్తే అది రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. ఆ కథ మొత్తం మన పక్కనే జరుగుతున్నట్టు ఉంటుంది.

‘జై చిరంజీవ’ ని రియాలిటీకి దగ్గరగా స్టార్ట్ చేసి తర్వాత చిరంజీవి గారి ఇమేజ్ కి తగ్గట్టు బ్లెండ్ చేద్దాం అనుకున్నాను. అది పూర్తిగా నాదే తప్పు. ఆ సినిమా షూటింగ్ విషయంలో.. అశ్వినీదత్ గారు చాలా కోపరేట్ చేశారు. అమెరికాలో 30 రోజులు షూటింగ్ చేయాలంటే.. ఏ నిర్మాతైనా భయపడిపోతారు. కానీ దత్ గారు.. ఏమాత్రం కంగారు పడకుండా ఓకే చెప్పేశారు. ఆయన విజన్ అలాంటిది.

చిరంజీవి గారు ఎన్నో కష్టాలు పడి.. ఆ సినిమాని కంప్లీట్ చేశారు. ఆయన ఎందుకు స్టార్ అయ్యాడో అప్పుడు నాకు అర్థమైంది. ‘జై చిరంజీవ’ ఇప్పుడైతే బాగానే అనిపిస్తుంది. కానీ అప్పుడు ఎక్కలేదు.అంతకు మించి దాని గురించి ఏమీ చెప్పలేం” అంటూ చెప్పుకొచ్చారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.