March 22, 202507:31:41 AM

Kalki 2898 AD: సౌత్‌లో ఎవరికీ సాధ్యం కాని రికార్డు.. ఇప్పుడు ప్రభాస్‌ పేరు మీదే..!

ఒక్క సినిమాకు రూ. 1000 కోట్లు వసూళ్లు వచ్చాయి అంటేనే ‘వావ్‌’ అనుకుంటున్న రోజులు ఇవి. అలాంటిది రెండు సినిమాలు ఆ ఫీట్‌ను సాధించాయి అని అంటే రికార్డు అనే చెప్పాలి. ఇప్పుడు ఆ అరుదైన రికార్డును అందుకున్నాడు ప్రభాస్‌  (Prabhas) . తన కొత్త సినిమా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) రూ. 1000 కోట్లు (గ్రాస్‌) మార్కును అందుకుంది. ఈ మేరకు చిత్రబృందం ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. దీంతో అతని రికార్డు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

‘కల్కి 2898 ఏడీ’ సినిమా విడుదలై తొలి రోజు నుండే రికార్డు స్థాయిలో వసూళ్లు అందుకుంటూ వస్తోంది. అలా ఈ సినిమా గురువారం మరో రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లు (గ్రాస్‌) వసూలు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది. ‘కల్కి 2898 ఏడీ’ సినిమా కంటే ముందు ఈ రికార్డును సాధించిన భారతీయ చిత్రాలు ఆరు ఉన్నాయి. అలా ‘కల్కి 2898 ఏడీ’ స్థానం ఏడు.

ఫుల్‌ రన్‌లో ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు అందుకున్న సినిమాల లిస్ట్‌ చూస్తే.. ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan) ‘దంగల్‌’ (2016) రూ.2024 కోట్లు, ప్రభాస్‌ – రాజమౌళి (Rajamouli) ‘బాహుబలి 2’ (Baahubali 2)  (2017) రూ.1810 కోట్లు, తారక్‌ (Jr NTR) – రాజమౌళి – రామ్‌చరణ్‌ (Ram Charan) ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) (2022) రూ.1387 కోట్లు, యశ్‌ (Yash) – ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) ‘కేజీయఫ్‌ 2’ (KGF2) (2022) రూ.1250 కోట్లు, షారుఖ్‌ ఖాన్‌ (Shah Rukh Khan) – అట్లీ (Atlee Kumar) ‘జవాన్‌’ (Jawan) (2023) రూ.1148 కోట్లు, షారుఖ్‌ ఖాన్‌ ‘పఠాన్‌’ (2023) రూ.1050 కోట్లు ఉన్నాయి.

పై లిస్ట్‌ చూస్తే.. మీకే అర్థమవుతోంది. రూ వెయ్యి కోట్లు అందుకున్న హీరోల్లో రెండోసారి పేరు ఉన్న ఏకైక తెలుగు హీరో, దక్షిణాది హీరో ప్రభాస్‌ మాత్రమే. ‘బాహుబలి 2’ తర్వాత ఈ సినిమాతో ప్రభాస్‌ ఆ ఫీట్‌ అందుకున్నాడు. హిందీలో అయితే షారుఖ్‌కి ఆ ఘనత దక్కింది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.