March 20, 202512:14:08 PM

Nithin: ‘రాబిన్ హుడ్’ లో నితిన్ షాకింగ్ లుక్.. వీడియో వైరల్.!

నితిన్ (Nithin) చాలా కాలంగా హిట్టు కోసం అల్లాడుతున్నాడు. కోవిడ్ తర్వాత నితిన్ చేసిన సినిమాలు ‘చెక్’ (Check) ‘మాచర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam) ‘ఎక్ట్రా ఆర్డినరీమెన్’ (Extra Ordinary Man) దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. ‘రంగ్ దే’ (Rang De) యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. మొత్తంగా ‘భీష్మ’ (Bheeshma) తర్వాత నితిన్ ఖాతాలో ఒక్క హిట్టు కూడా పడలేదు. ఈ నేపథ్యంలో కచ్చితంగా హిట్టు కొట్టాలని వెంకీ కుడుముల దర్శకత్వంలోనే ‘రాబిన్ హుడ్’ (Robinhood) అనే సినిమా చేస్తున్నాడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని రూ.70 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

సగం పైనే షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ మధ్య అయితే ‘రాబిన్ హుడ్’ కి సంబంధించి ఎటువంటి అప్డేట్ రాలేదు. దీంతో షూటింగ్ జరుగుతుందా లేక ఆగిందా? అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ముందు జాగ్రత్తగా దర్శకుడు వెంకీ కుడుముల (Venky Kudumula) షూటింగ్ స్పాట్ కి సంబంధించిన ఓ వీడియో షేర్ చేశాడు. ఇందులో నితిన్ లుక్ అందరినీ షాక్ కి గురి చేసింది అని చెప్పాలి. ఎందుకంటే వృద్ధుడి గెటప్ లో నితిన్ దర్శనమిచ్చాడు.

మరోపక్క హీరోయిన్ శ్రీలీల (Sreeleela) లిప్ స్టిక్ వేసుకుంటుంది. ‘రోజూ సెట్స్ లో ఒకరినొకరు ఏడిపించుకుంటున్నారు’ అనే అర్ధం వచ్చేలా దర్శకుడు ఈ వీడియోకి ట్యాగ్ లైన్ పెట్టాడు. ఈ సినిమాలో నితిన్ దొంగ పాత్ర చేస్తున్నాడు కాబట్టి.. కథలో భాగంగా వచ్చే యాక్షన్ సీన్లో ఈ గెటప్ వేసుంటాడేమో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.