March 21, 202501:01:43 AM

Kamal Haasan: ఆ సినిమా సక్సెస్ తో కమల్ పారితోషికం ఏకంగా రూ.25 కోట్లు పెరిగిందా?

సౌత్ ఇండియాలో కమల్ హాసన్ కు (Kamal Haasan) ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. విక్రమ్ (Vikram) సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించి నిర్మాతలకు ఏ స్థాయిలో లాభాలను అందించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కమల్ హాసన్ నటించిన ఇండియన్2 సినిమా తెలుగులో భారతీయుడు2  (Bharateeyudu 2) పేరుతో విడుదల కావడం గమనార్హం. ఇండియన్2 సినిమాకు కమల్ పారితోషికం ఏకంగా 75 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. విక్రమ్ సినిమాకు కమల్ రెమ్యునరేషన్ 50 కోట్ల రూపాయలు కాగా కల్కి (Kalki 2898 AD)  సినిమాలో గెస్ట్ రోల్ కోసం 20 కోట్ల రూపాయలు పారితోషికంగా అందుకున్న కమల్ హాసన్ భారతీయుడు2 సినిమాకు మాత్రం 25 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ ను పెంచి తీసుకోవడం గమనార్హం.

కమల్ హాసన్ ఇప్పటివరకు తీసుకున్న పారితోషికాలలో ఇదే హైయెస్ట్ అని సమాచారం అందుతోంది. భారతీయుడు2 సినిమా యావరేజ్ టాక్ తో ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాకు తొలిరోజే రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు రావడం గమనార్హం. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లను బట్టి ఈ సినిమా ఫైనల్ రిజల్ట్ తేలిపోనుంది. కమల్ హాసన్ కెరీర్ పరంగా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతుండగా భాషతో సంబంధం లేకుండా కమల్ కు క్రేజ్ పెరుగుతోంది.

కల్కి సీక్వెల్ లో కమల్ పాత్ర నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. కమల్ హాసన్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కమల్ హాసన్ తన సినిమాలలో విభిన్నమైన గెటప్స్ లో నటిస్తూ ప్రేక్షకులకు అంతకంతకూ దగ్గరవుతున్నారు.

కమల్ హాసన్ బాలీవుడ్ ఇండస్ట్రీలో మార్కెట్ ను మరింత పెంచుకోవాలని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కమల్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. కమల్ వయస్సు పెరుగుతున్నా ఆయనలో ఎనర్జీ లెవెల్స్ తగ్గడం లేదు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.